Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ మంచి వయొలెన్స్ తో నిండినది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అభిమానులు ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ చూసి మెంటలెక్కిపోయారు. ముఖ్యంగా ఈ నెల ప్రారంభం లో విడుదల చేసిన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమంతా చూసాము. 20 రోజుల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికీ అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. అంతటి ఫైర్ సాంగ్ తర్వాత ఈ చిత్రం నుండి ఒక మెలోడీ సాంగ్ ని విడుదల చేయబోతున్నాము అంటూ మేకర్స్ కొద్దిరోజుల క్రితమే అధికారిక ప్రకటన చేశారు. ముందుగా ప్రోమో ని విడుదల చేద్దామని చూసారు కానీ, ఒక కూల్ కంటెంట్ తోనే సరిపెట్టారు. కాసేపటి క్రితమే ఈ చిత్రం లోని రెండవ పాటకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) పెయిర్ చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపించింది. ‘సువ్వి సువ్వి’ అంటూ సాగే పాట సినిమాలో పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలుస్తుందని, మెలోడీ లవర్స్ కి ఒక పండగ లాగా ఉంటుందని అంటున్నారు. కొంతమంది ఇంత వయొలెన్స్ సినిమాలో ఇలాంటి సున్నితమైన పాటలు అవసరమా అని అంటుంటే, మరి కొంతమంది మాత్రం ఇలాంటి పాటలు కచ్చితంగా ఉండాలి, ఎంతసేపు హింస ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు రారు, కాస్త ఇలాంటి టచ్ కూడా ఇస్తుండాలి అంటూ చెప్పుకొచ్చారు. వినాయక చవితి సందర్భంగా, ఆగష్టు 27 న 10 గంటల 8 నిమిషాలకు ఈ పాట ని విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ పాట ని శ్రేయ గోషాల్ మరియు చిత్ర లతో రెండు వెర్షన్స్ పాడించారు. ఎవరి వెర్షన్ ని విడుదల చేయబోతున్నారో చూడాలి.
పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రం లో కూడా ‘అంతా ఇష్టం’ అనే మెలోడీ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. కానీ ఈ పాట ని సినిమాలో నుండి తొలగించేసారు. దయచేసి అలాంటి పని మాత్రం రిపీట్ చేయొద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ మెలోడీ సాంగ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా?, ఫైర్ స్ట్రోమ్ సాంగ్ మేనియా ని మరపిస్తుందా అనేది. ఇకపోతే సెప్టెంబర్ 25 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 29 వ తారీఖు నుండి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికా లో థియేటర్స్ లిస్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ చిత్రం ఇండియన్ ఫిలిమ్స్ లోనే ప్రీమియర్స్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.