Bhartha Mahasayulaku Wignyapthi OTT release: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) హీరో గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే మిగిలింది. కారణం రవితేజ కి ఈ చిత్రానికి ముందు వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు రావడం , నాలుగు సినిమాలతో పోటీ పడడం, వాటికి ఈ సినిమాకంటే మంచి టాక్ రావడమని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే సినిమా విడుదలై దాదాపుగా 50 రోజులు కావొస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఓటీటీ లో విడుదల కాకపోవడం పై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. గత నెల 13 న జీ5 యాప్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పటి వరకు అవ్వలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలకు మోక్షం లభించినట్టు తెలుస్తోంది.
ఏ నెల 13 నుండి ఈ చిత్రాన్ని జీ5 యాప్ లో వీక్షించవచ్చు. కేవలం ఒక్క తెలుగు లో మాత్రమే కాదు, హిందీ, కన్నడ, మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో సక్సెస్ అవ్వలేకపోయిన ఈ సినిమా , కనీసం ఓటీటీ లో అయినా భారీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. థియేటర్స్ లో ఆడియన్స్ ఈ చిత్రాన్ని పెద్దగా చూడలేదు కాబట్టి, పైగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాబట్టి, ఈ సినిమాకు ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, డింపుల్ హయాతి , ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు . వెన్నెల కిషోర్ , సునీల్ , సత్య వంటి వారు కీలక పాత్రలు పోషించారు. వీళ్ళ కామెడీ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు,
Also Read: 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’..#RRR ని భారీ మార్జిన్ తో లేపేసిందిగా!
బాక్స్ ఆఫీస్ వద్ద 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సొంతం చేసుకొని , డిజాస్టర్ గా నిలుచున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు అలరిసిందో చూడాలి . ఇక రవితేజ తదుపరి సినిమా ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, దానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము.