Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి ఫస్ట్ డే ఏపీ/తెలంగాణా కలెక్షన్స్… బాలయ్యకు భారీ షాక్!

వరుస పరాజయాలతో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన బాలయ్యకు అఖండ ఊపిరి పోసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 15.3 కోట్ల ఫస్ట్ డే షేర్ నమోదు చేసింది.

Written By: NARESH, Updated On : October 20, 2023 3:43 pm

Bhagavanth Kesari

Follow us on

Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి అద్భుతం అంటూ అనేక సైట్స్ రేటింగ్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఊదరగొట్టారు. అయితే రియాలిటీలో పరిస్థితి వేరుగా ఉంది. ఒక్క గుంటూరు మినహాయిస్తే… భగవంత్ కేసరి ఓపెనింగ్ డే వసూళ్లు దారుణంగా ఉన్నాయి. బాలకృష్ణ గత రెండు హిట్ చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి కంటే చాలా తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. వీరసింహారెడ్డి వసూళ్ళలో అయితే సగం మాత్రమే దక్కాయి.

వరుస పరాజయాలతో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన బాలయ్యకు అఖండ ఊపిరి పోసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 15.3 కోట్ల ఫస్ట్ డే షేర్ నమోదు చేసింది. ఇక 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి రూ. 25 కోట్ల ఫస్ట్ డే ఏపీ/టీజీ షేర్ రాబట్టింది. వీరసింహారెడ్డికి మిక్స్డ్ టాక్ రావడం విశేషం. అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న భగవంత్ కేసరి వసూళ్లు మాత్రం ఆ చిత్ర దరిదాపుల్లో కూడా లేవు

ఏపీలో ఒక్క గుంటూరులో మాత్రమే భగవంత్ కేసరి రికార్డు వసూళ్లు అందుకుంది. బాలకృష్ణకు స్ట్రాంగ్ జోన్ గా ఉన్న గుంటూరులో ఫస్ట్ డే రూ.3.08 కోట్ల షేర్ తో రికార్డు బ్రేక్ చేసింది. నైజాంలో రూ.4.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, సీడెడ్ రూ.2.50 కోట్ల వసూళ్లు దక్కాయి. ఏపీ/తెలంగాణాలలో కలిపి రూ. 13.6 కోట్ల షేర్ మాత్రమే భగవంత్ కేసరి రాబట్టింది. హైదరాబాద్ లో లియో వసూళ్ల కంటే తక్కువ భగవంత్ కేసరికి నమోదయ్యాయి.

సినిమా అద్భుతం అంటూ ఎంత ప్రచారం చేసినా కలెక్షన్స్ లో ఆ జోరు కనిపించలేదు. అయితే దసరా సీజన్లో విడుదల కావడం కలిసొచ్చే అంశం. భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు.. !

ఏరియా వైజ్ ఫస్ట్ డే ఏపీ/తెలంగాణా వసూళ్లు…

నైజాం – 4.12 కోట్లు
సీడెడ్ – 2.50 కోట్లు
UA ప్రాంతం – 1.2 కోట్లు
గుంటూరు – 3.08 కోట్లు
తూర్పు – 72 లక్షలు
వెస్ట్ – 80 లక్షలు
కృష్ణ – 65 లక్షలు
నెల్లూరు – 55 లక్షలు

1వ రోజు మొత్తం AP&TS షేర్: 13.66 కోట్లు

భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ రూ. 66 కోట్లు…