Sameera: దసరా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు వెలిగిపోతుంటాయి. దేవీ నవరాత్రులను రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటాయి. కానీ బతుకమ్మ సంబురాలు మాత్రం తెలంగాణలోనే విల్లువిరుస్తాయి. ఆటలు, పాటలు, రంగురంగుల పూలతో ఇల్లు వాకిలి సందడితో మారుమోగుతుంది. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో ఈ సంబురాలలో పాల్గొంటారు. అంతేనా సెలబ్రేట్ చేసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు కూడా. ఇదే క్రమంలో నటి సమీరా కూడా బతుకమ్మ ఆడి ఆగ్రహం తెప్పించింది. బతుకమ్మ ఆడితే ఆగ్రహం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇదిగో ఇది మీకోసమే..
బుల్లితెర నటి సమీరా.. సనా కోడలుగా అందరికీ ఎంతో సుపరిచితమే ఒకప్పుడు వరుస సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండేది. కానీ ప్రస్తుతం చాలా వరకు తగ్గించిందనే చెప్పాలి. సీరియల్స్ కు చాలా దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం తనకు సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. కుమారుడు, ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను పంచుకునే ఈమె తాజాగా బతుకమ్మ ఆడుతూ ఆ వీడియోను కూడా పంచుకుంది. ముస్లిం అయినా సమీరా బతుకమ్మ సంబురాలలో పాల్గొనడంతో కొందరు ప్రశంసిస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు. దానికి కూడా కారణం ఉంది.
ఎంతో గౌరవం పూజించుకునే గౌరమ్మ ముందు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడడం ఏంటి అని తిట్టిపోస్తున్నారు. అదేనండి సమీరా బతుకమ్మ ఆడుతూ చెప్పులు వేసుకుంది. కాళ్ల దుమ్ము పడుతుందని కాస్తైనా ఆలోచించరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా మీరు సెలబ్రేట్ చేసుకోవడం గ్రేట్ కానీ.. పద్దతులు కూడా పాటించాలి అంటూ మండిపడుతున్నారు. మరి దీనికి సమీరా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.