https://oktelugu.com/

Bhagavanth Kesari Collections: దసరా రోజు దున్నేసిన బాలయ్య… భగవంత్ కేసరి 5వ రోజు వసూళ్లు మైండ్ బ్లాంక్!

టైగర్ నాగేశ్వరరావు పరిస్థితి దారుణంగా ఉంది. ఈ చిత్రం నష్టాలు మిగల్చడం ఖాయం. భగవంత్ కేసరి ఆదివారంతో పాటు దసరా పండగ రోజైన సోమవారం సత్తా చాటింది. సినిమాకు ఈ రెండు రోజులు బాగా కలిసొచ్చాయి. ఏపీ/తెలంగాణాలలో టైగర్ నాగేశ్వరరావు 5వ రోజు రూ.4.70 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2023 / 12:28 PM IST

    Bhagavanth Kesari Collections

    Follow us on

    Bhagavanth Kesari Collections: దసరా బరిలో దిగిన బాలకృష్ణ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. భగవంత్ కేసరి చిత్ర వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఫస్ట్ వైడ్ భగవంత్ కేసరి రూ. 16 కోట్ల వర్ల వైడ్ షేర్ రాబట్టింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా పండగ సెలవులు కలిసొచ్చాయి. పోటీగా విడుదలైన లియో, టైగర్ నాగేశ్వరరావు చేతులు ఎత్తేశాయి. పూర్తి నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. లియో నెగిటివ్ టాక్ తో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది.

    టైగర్ నాగేశ్వరరావు పరిస్థితి దారుణంగా ఉంది. ఈ చిత్రం నష్టాలు మిగల్చడం ఖాయం. భగవంత్ కేసరి ఆదివారంతో పాటు దసరా పండగ రోజైన సోమవారం సత్తా చాటింది. సినిమాకు ఈ రెండు రోజులు బాగా కలిసొచ్చాయి. ఏపీ/తెలంగాణాలలో టైగర్ నాగేశ్వరరావు 5వ రోజు రూ.4.70 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ రూ. 5.70 కోట్ల షేర్ వసూలు చేసిందట.

    ఇక ఐదు రోజులకు భగవంత్ కేసరి రూ. 40 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ బిజినెస్ గమనిస్తే… ఏపీ/తెలంగాణాలలో రూ. 55 కోట్లు, వరల్డ్ వైడ్ రూ. 67 కోట్ల వరకూ జరిగింది. అంటే రూ. 68 కోట్ల టార్గెట్ తో భగవంత్ కేసరి బరిలో దిగింది. మరో రూ. 28 కోట్లు వస్తే కానీ మూవీ విజయం సాధించినట్లు లెక్క.

    చిత్ర నిర్మాతలు ఐదు రోజులకు రూ. 100 కోట్ల మార్క్ దాటినట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. అయితే ట్రేడ్ చెబుతున్న లెక్కలకు నిర్మాతలు ప్రకటిస్తున్న నెంబర్స్ కి సంబంధం లేదు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్స్, ఎక్కువ చేసి ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా టాక్. భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందించారు.