Prabhas- Anushka: ఫ్యాన్సూ.. ఇదేం క్రియేటివిటీరా బాబూ.. ప్రభాస్, అనుష్క పిల్లలతో ఉన్న ఫొటోలు వైరల్

ఈశ్వర్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఛత్రపతితో స్టార్ అయ్యారు. ఆ తరువాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాహుబలి 1,2 సినిమాల తరువాత అయన తీసేవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే.

Written By: Chai Muchhata, Updated On : October 24, 2023 12:33 pm

Prabhas- Anushka

Follow us on

Prabhas- Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్. భారీ బడ్జెట్ చిత్రాల హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ పాన్ ఇండియా లెవల్లోనే సినిమాలు తీస్తున్నాడు. ప్రభాస్ గురిపంచి సినిమాల్లోనే కాకుండా ఆయన పర్సనల్ లైఫ్ గురించి నిత్యం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన పెళ్లి విషయంపై ఫ్యాన్ష్ కు ఉత్కంఠగా మారింది. అదిగో.. ఇదిగో.. అంటూ ప్రభాస్ దాటవేస్తూ ఉన్నా.. ఆయన త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకుంటారని గతంలోనే కొన్ని ఫొటోలు క్రియేట్ చేసి బయటపెట్టారు. తాజాగా వీరు కలిసి జీవిస్తే ఎలా ఉంటారు? అనే దానిపై కొన్ని ఫొటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ ఫొటోలు రచ్చ చేస్తున్నాయి.

ఈశ్వర్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఛత్రపతితో స్టార్ అయ్యారు. ఆ తరువాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాహుబలి 1,2 సినిమాల తరువాత అయన తీసేవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా బిజీ షెడ్యూల్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ పెళ్లి విషయంపై అభిమానులకు క్లారిటీ ఇవ్వడం లేదు. అటు తన ఫ్యామిలీ నుంచి కూడా ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగలేక పోతున్నారు.

మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రతీ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఫ్యాన్ష్ హంగామా చేస్తారు. ఈసారి అంతకుమించి అన్నట్లుగా చేశారు. ప్రభాస్, అనుష్కలు కలిసి పెళ్లి చేసుకొని, ఆ తరువాత పిల్లలతో ఉంటే ఎలా ఉంటారు? అనేది ఊహ అయినా దానిని కళ్లకు కట్టినట్లుగా కొన్ని ఫొటోలను క్రియేట్ చేశారు. ప్రభాస్, అనుష్కలకు ముగ్గురు పిల్లలను కని వారిలో చెరొకరు ఎత్తుకొని,మరికరు వారితో ఉన్నట్లు ఫొటోలను తయారు చేశారు. ఈ ఫొటోలు అంతా పర్ఫెక్ట్ ఉండడంతో అవి వైరల్ గా మారుతున్నాయి.

ప్రభాస్, అనుష్కలు భార్య భర్తలు గానే కాకుండా శివ, పార్వతిలు అయితే ఎలా ఉంటారు? అనే దానిని కూడా క్రియేట్ చేశారు. వీరిద్దరు శివపార్వతుల్లాగా అచ్చుగుద్దినట్లు ఉన్నారు. దీంతో ఈ పిక్స్ కు తెగ లైక్స్ కొట్టేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని దివంగత రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి తో పాటు ప్రభాస్ తల్లి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వీళ్లు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా సాలార్ తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.