Anchor Varshini: వీపు చూపిస్తూ అందాల ఆరబోస్తున్న యాంకర్ వర్షిణి.. వైరల్ ఫొటోలు…

మల్లెమాల వాళ్ళు నిర్వహించిన పటాస్, ఢీ షో లో యాంకర్ గా చేసి తనదైన మార్క్ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ జనాలను ఆకర్షిస్తూ వస్తున్నారు.

Written By: Gopi, Updated On : October 24, 2023 12:24 pm

Anchor Varshini

Follow us on

Anchor Varshini: బుల్లితెర మీద యాంకర్లు గా చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నవారు చాలా మంది ఉన్నారు.అయితే రీసెంట్ గా యాంకర్లుగా బుల్లితెర మీద చేస్తూ వెండితెరకు పరిచయమైన వారు కూడా ఉన్నారు అలాంటి వాళ్లలో యాంకర్ వర్షిణి ఒకరు. ఈమె బుల్లితెర మీద యాంకర్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ముఖ్యంగా పటాస్ షో ద్వారా ఆమె మంచి గుర్తింపును సంపాదించుకొని లేడీ యాంకర్ గా ఈమె చాలా రోజుల వరకు టాప్ పొజిషన్ లో కొనసాగింది.

ఆ తర్వాత ఈమె చాలా షోస్ కి యాంకర్ గా చేస్తూ, అలాగే చాలా ఈవెంట్లలో కూడా పాల్గొని తనదైన పర్ఫామెన్స్ తో అందరిని అలరిస్తూ, నటిస్తూ, డాన్సులు వేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి క్రమంలో ఈమె వరుసగా మల్లెమాల వాళ్ళు నిర్వహించిన పటాస్, ఢీ షో లో యాంకర్ గా చేసి తనదైన మార్క్ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ జనాలను ఆకర్షిస్తూ వస్తున్నారు.అయితే ఢీ షోలో ఆమె చేసిన కామెడీని గుర్తుంచకున్న అభిమానులు ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేసే ప్రతి ఫోటో కింద కామెంట్ల రూపం లో ఆమె చెప్పిన డైలాగులు గాని, ఆమె చేసిన కామెడీ గురించి గానీ డిస్కస్ చేస్తూ ఆ డైలాగులని కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆమె ప్రేక్షకుల్లో ఎంత అభిమానాన్ని సంపాదించుకుందొ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక్క ఫోటోని ఆమె పోస్ట్ చేసి చాలా కామెంట్లను ఎదుర్కొంటున్నారు. వీపు మొత్తం కనిపించేలా ఒక ఫోటో షూట్ చేసి దానిని ఆమె అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇది చూసిన వర్షిని అభిమానులు అందరూ కూడా వర్షిని అందాల ఆరబోతకు సిద్ధమైంది అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆమె శంభో శివ శంభో, లవర్స్ లాంటి సినిమాలు నటించింది. అలాగే రీసెంట్ గా సమంత మెయిన్ లీడ్ లో వచ్చిన శాకుంతలం సినిమాలో కూడా నటించింది.ఇక అలాగే బాగ్ సాలే లాంటి సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఇలా సోషల్ మీడియా లో ఆమె పిక్ ని చూసిన మరికొందరు మాత్రం వర్షిణి సూపర్ అంటూ కామెంట్ చేయగా, ఇంకొందరు మాత్రం వర్షిణి కి అవకాశాలు తగ్గినట్టుగా ఉన్నాయి అందుకోసమే తను ఇలాంటి హాట్ లుక్స్ తో ఫోటోలు పెడితే అది చూసిన దర్శక, నిర్మాతలు ఏదైనా అవకాశం ఇస్తారేమో అన్నట్టుగా చూస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.

నిజానికి వర్షిణి సినిమాల్లో నటిద్దామని ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆమెకు బుల్లితెర మీద యాంకర్ గా అవకాశం రావడంతో యాంకర్ గానే కొనసాగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు అవకాశం దొరికితే సినిమాల్లో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. చూడాలి మరి ఈ ఫోటోలు ద్వారా ఆమెకి ఏ మేరకు అవకాశాలు వస్తాయో…