దోస్త్ మేరా దోస్త్ః మ‌న హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

స్నేహితుడు ఎందుకు ప్ర‌త్యేకం? ప్రశ్న ఒక్క‌టే.. స‌మాధానాలు ఎన్నో! పేరులోనే ఉన్నాడు హితుడు. మ‌న మంచి కోరేవాడు. ఆనందం వ‌చ్చినా వాడే కావాలి. క‌ష్టం వ‌చ్చినా వాడే వెన్నంటి ఉండాలి. జ‌న్మ‌నిచ్చిన వారు, తోడ‌బుట్టిన వారితో షేర్ చేసుకోలేని ఎన్నో విష‌యాల‌కు వాడు చెవుల‌తోపాటు హృద‌యం అప్ప‌గిస్తాడు. త‌న‌కు తెలిసిన మార్గాన్ని సూచిస్తాడు. ఎందాకైనా తోడుగా వ‌స్తాడు. అందుకే.. ప్ర‌తివారికీ కావాలి.. ఓ స్నేహితుడు. అయితే.. ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు. కానీ.. గుండెల్లో స్థానం సంపాదించుకున్న‌వారు […]

Written By: K.R, Updated On : August 1, 2021 5:17 pm
Follow us on

స్నేహితుడు ఎందుకు ప్ర‌త్యేకం? ప్రశ్న ఒక్క‌టే.. స‌మాధానాలు ఎన్నో! పేరులోనే ఉన్నాడు హితుడు. మ‌న మంచి కోరేవాడు. ఆనందం వ‌చ్చినా వాడే కావాలి. క‌ష్టం వ‌చ్చినా వాడే వెన్నంటి ఉండాలి. జ‌న్మ‌నిచ్చిన వారు, తోడ‌బుట్టిన వారితో షేర్ చేసుకోలేని ఎన్నో విష‌యాల‌కు వాడు చెవుల‌తోపాటు హృద‌యం అప్ప‌గిస్తాడు. త‌న‌కు తెలిసిన మార్గాన్ని సూచిస్తాడు. ఎందాకైనా తోడుగా వ‌స్తాడు. అందుకే.. ప్ర‌తివారికీ కావాలి.. ఓ స్నేహితుడు. అయితే.. ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు. కానీ.. గుండెల్లో స్థానం సంపాదించుకున్న‌వారు మాత్రం వేళ్ల‌మీద లెక్క‌బెట్టేవారే ఉంటారు. మ‌రి, మ‌న టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రు? తమ హృద‌యంలో ఎవ‌రికి స్థానం ఇచ్చారు? అన్న‌ది చూద్దాం.

చిరు – నాగ్ః సీనియ‌ర్ హీరోల‌లో మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లిద్ద‌రూ క‌లిసి ఎన్నో సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని రుజువు చేశారు. ఇండ‌స్ట్రీకి సంబంధించి స్పెష‌ల్ అకేష‌న్స్ ఏవి ఉన్నా.. వీళ్లిద్ద‌రూ హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ప‌ర్స‌న‌ల్ అకేష‌న్స్ లోనూ వీళ్లు క‌లిసిపోతుంటారు.

ప‌వ‌న్ – అలీః ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌మెడియ‌న్ అలీ ఎలాంటి స్నేహితులో అంద‌రికీ తెలిసిందే. అలీ లేక‌పోతే త‌న‌కు వెలితిగా ఉంటుంద‌ని ప‌వ‌న్ చాలాసార్లు చెప్పారు. అందుకే.. త‌న ప్ర‌తి సినిమాలోనూ అలీ ఉండి తీరాల్సిందే. ఇలాంటి వీళ్లు పాలిటిక్స్ లో భాగంగా చెరో మాట అనుకోవ‌డం అభిమానుల‌ను బాధించింది. అయితే.. మ‌ళ్లీ క‌లిసిపోయారు. ఆ మ‌ధ్య అలీ ఇంట్లో జ‌రిగిన ఫంక్ష‌న్ కు ప‌వ‌న్ వెళ్లారు. అక్క‌డ అంద‌రూ స‌ర‌దాగా గ‌డిపారు.

ఎన్టీఆర్‌-రాజ‌మౌళిః జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి కూడా మంచి స్నేహితులు. వీళ్లిద్ద‌రూ సినీ కెరీర్ మొద‌లు పెట్టింది ఒకే సినిమాతో. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాతో మొద‌లైన వీరి జ‌ర్నీ.. దిగ్విజ‌యంగా కొన‌సాగుతూనే ఉంది. తార‌క్ అని రాజ‌మౌళి పిలవ‌డంతోనే ఆ పేరు ఫేమ‌స్ అయ్యింది. అదేవిధంగా.. రాజ‌మౌళిని జ‌క్క‌న్న‌ను చేసింది కూడా జూనియ‌రే. అలా.. వీరి ఫ్రెండ్షిప్ కొన‌సాగుతోంది.

త్రివిక్ర‌మ్ – సునీల్ః వీళ్లిద్ద‌రూ చ‌దువుకునే రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్‌. ఇద్ద‌రూ క‌లిసే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించే రోజుల్లో.. ఒకే రూమ్ లో ఉంటూ, స్కూట‌ర్ పై తిరిగేవారు. ఇప్ప‌టికీ వారిమ‌ధ్య అదేస్నేహం కొన‌సాగుతోంది. సునీల్ కు సూప‌ర్ రోల్స్ రాసి, స్టార్ క‌మెడియ‌న్ ను చేయ‌డంలో త్రివిక్ర‌మ్ పాత్ర ఎంతో ఉంది.

రామ్ చ‌ర‌ణ్ – రానాః వీళ్లు కూడా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. ఇండ‌స్ట్రీ మ‌ద్రాస్ లో ఉన్న‌ప్ప‌డు క‌లిసి స్కూల్ కు వెళ్లేవారు. కాలేజ్ బంక్ కొట్టి సినిమాల‌కు వెళ్లేవాళ్ల‌మ‌ని స్వ‌యంగా రానా చెప్పాడు. ఇప్ప‌టికీ.. అకేష‌న్ తో సంబంధం లేకుండా.. వీళ్లిద్ద‌రూ క‌లుస్తుంటారు.

ప్ర‌భాస్ – గోపీచంద్ః ఇండ‌స్ట్రీలో మ‌రో బెస్ట్ ఫ్రెండ్స్ గోపీచంద్ – ప్ర‌భాస్‌. వీళ్లిద్ద‌రి బంధం వ‌ర్షం సినిమాతో బ‌ల‌ప‌డింది. అందులో గోపీచంద్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇద్ద‌రూ స్నేహితులుగా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. తాను స్టైలిష్ గా మార‌డంలో నా దోస్తు ప్ర‌భాస్ పాత్ర చాలా ఉందంటాడు గోపీ.

అల్ల‌రి న‌రేష్ – నాని – శ‌ర్వాః వీళ్లు ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్‌. వీరిలో న‌రేష్‌-శ‌ర్వా గ‌మ్యం సినిమాలో క‌లిసి న‌టించారు. ఎప్పుడు అవ‌కాశం దొరికినా.. వీళ్లు క‌లిసిపోతుంటారు.

పూరీ జ‌గ‌న్నాథ్ – ర‌వితేజః వీళ్లు కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌. హీరోగా ర‌వితేజ‌, ద‌ర్శ‌కుడిగా పూరీ కొద్ది తేడాతోనే జ‌ర్నీ మొద‌లు పెట్టారు. ర‌వితేజ హీరోగా మార‌డంలో, నిల‌వ‌డ‌డంలో పూరీ జ‌గ‌న్నాథ్ పాత్ర ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. అందుకే.. వీరిద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ఇద్ద‌రూ పంచుకుంటారు.