Chiru and Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దర్శకుడు వశిష్ఠ మల్లిడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. విశ్వంభర చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా చిరంజీవి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న మరో చిత్రం అనిల్ రావిపూడి కాంబోలో. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
అనిల్ రావిపూడి వరుస విజయాలతో జోరు మీదున్నారు. మినిమమ్ గ్యారంటీ దర్శకుడిగా ఆయన రికార్డులకు ఎక్కాడు. అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. సోలోగా వెంకటేష్ కి దశాబ్దాల అనంతరం భారీ హిట్ సంక్రాంతికి వస్తున్నాం రూపంలో అనిల్ రావిపూడి ఇచ్చాడు. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బ్లాక్ బస్టర్ దర్శకుడితో చిరంజీవి మూవీ అనగానే పరిశ్రమలో అంచనాలు పెరిగాయి.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
సంక్రాంతికి సినిమా విడుదల చేసి హిట్స్ కొట్టడం అలవాటుగా పెట్టుకున్న అనిల్ రావిపూడి.. చిరంజీవి సినిమాను సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. చిరు-అనిల్ ప్రాజెక్ట్ మే 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుందట. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో భారీగా ప్లాన్ చేశారట. రానున్న ఆరు నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నారట.
అలాగే చిరంజీవికి జంటగా నయనతారను ఎంచుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అనంతరం చిరంజీవి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నాడు. చిరంజీవి కెరీర్లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా శ్రీకాంత్ ఓదెల మూవీ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ నాని హీరోగా ది పారడైజ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?