BB Jodi 2: స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారం అవుతున్న ‘BB జోడి 2’ కి బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అవుతున్నాయి. బిగ్ బాస్ పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కొందరు, గత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కొందరు ఈ షో లో పాల్గొనడం తో ఆడియన్స్ విపరీతమైన ఆసక్తి చూపించారు. గత సీజన్ నుండి ఈ షో లోకి అడుగుపెట్టిన డిమోన్ పవన్ , రీతూ చౌదరి నాలుగు వారాలకే ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ 9 నుండి సాయి శ్రీనివాస్ మాత్రమే కొనసాగుతున్నాడు. ముందుగా ఆయనకు జోడిగా నయనీ పావని వచ్చింది, కానీ ఆమె మధ్యలోనే వెళ్లిపోవడం తో ఆమె స్థానంలోకి సీత ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ ఉండబోతుంది.
Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం మణికంఠ , ప్రియాంక జంట ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం ప్రతీ జోడీ కూడా తమతో పాటు ఒక సినీ సెలబ్రిటీ ని ఎంచుకొని డ్యాన్స్ చెయ్యాలి. మణికంఠ , ప్రియాంక లకు సపోర్టుగా ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల విచ్చేశాడు. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో లో పవన్ కళ్యాణ్ , మణికంఠ , ప్రియాంక డ్యాన్స్ చేస్తున్న సమయం లో , ఒక షాట్ లో పవన్ కళ్యాణ్ ప్రియాంక ని పైకి లిఫ్ట్ చేసే క్రమం లో బ్యాలన్స్ తప్పి ఇద్దరు క్రిందకు పడిపోతారు. ప్రియాంక కి గాయాలు అవుతాయి. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే.
అయితే మణికంఠ , ప్రియాంక అలా ఎలిమినేట్ అవ్వడానికి పవన్ కళ్యాణే కారణం , ఆయన వల్లే ఆమె క్రింద పడిపోయింది. ఆ కారణం చేత జడ్జీలు మార్కులు తగ్గించి ఇవ్వడం వల్ల వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని , ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. అయితే ఈ కామెంట్స్ పై ఆ షోలో ఒక కంటెస్టెంట్ గా చేస్తున్న ప్రముఖ కమెడియన్ ధనరాజ్ స్పందిస్తూ ‘చాలా మంది పవన్ కళ్యాణ్ వాళ్ళ మణికంఠ , నైనికా జోడీ ఎలిమినేట్ అయ్యిందట కదా, ప్రియాంక కి గాయాలు అయ్యాయట , ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నారు. కళ్యాణ్ వల్ల వాళ్లిద్దరూ ఎలిమినేట్ అవ్వలేదు, అందుకు వేరే కారణం ఉంది, ప్రియాంక , కళ్యాణ్ ఇద్దరు బాగానే ఉన్నారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న లేటెస్ట్ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.