స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా రన్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి ‘BB జోడి 2′(BB Jodi 2 ). ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో ఈ షో ముగియనుంది. అయితే ప్రస్తుతం ఉన్న వారిలో టాప్ 4 జంటలు ఏంటంటే, అమర్ దీప్- నైనికా, మానస్- శ్రేష్టి వర్మ అర్జున్ – శ్రీ సత్య , విశ్వ – నేహా. వీరిలో అమర్ దీప్ – నైనికా మరియు మానస్ – శ్రేష్టి వర్మ జంటల్లోనే టైటిల్ విన్నర్ ఉండొచ్చు . ఈ రెండు జంటలే ఈ సీజన్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి . అడుతమైన డ్యాన్స్ లు వేస్తూ , అత్యధిక శాతం గోల్డెన్ సోఫా లో కూర్చున్నది వీళ్ళే.
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
అయితే గత వారం అమర్ దీప్ – నైనికా జంట అద్భుతంగా డ్యాన్స్ వేసినప్పటికీ, జడ్జీలు కావాలని మార్కులు తగ్గించి , గోల్డెన్ సోఫా పొయ్యేలా చేసారని , ఇది చాలా అన్యాయం అంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసారు అభిమానులు . అయితే ఈ వారం మాత్రం ఈ జంట ఇరగ కుమ్మేసింది. జడ్జీలు వీళ్ళని ఒక రేంజ్ లో ప్రశంసించారు. కానీ కంటెస్టెంట్స్ లో సాయి – సీత జంట మాత్రం 10 కి 7 మార్కులే ఇచ్చారు. కారణం ఏంటంటే మీరిద్దరూ ఒక సింక్ లో డ్యాన్స్ వేయలేదు అని చెప్పింది సీత. అప్పుడు జడ్జిగా వ్యవహరిస్తున్న సదా మైక్ అందుకొని ‘ఏంటి సింక్ లో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయలేదా ?, ఏంటో ఇది , మేము మళ్లీ టీవీ లో చూసి తెలుసుకోవాలేమో ‘ అని అంటుంది.
ఇక చివర్లో సీత – సాయి జంట డ్యాన్స్ వేయగా ‘ఇంతటి చెత్త డ్యాన్స్ ని నేను బిగ్ బాస్ జోడి షో లోనే చూడలేదు ‘ అంటూ సదా చాలా కోపంగా జడ్జిమెంట్ ఇస్తుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. దీనికి సంబంధించిన ప్రోమో ని మీరు క్రింద చూడొచ్చు. అయితే అమర్ దీప్ కి కావాలని ఉద్దేశపూర్వకంగా సీత మార్కులు తగ్గించి ఇవ్వడాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. ఈ మార్కుల కారణంగా ఈసారి కూడా అమర్ దీప్ కి గోల్డెన్ సోఫా మిస్ అయ్యే అవకాశం ఉందేమో అని భయపడుతున్నారు. చూడాలి మరి రేపటి ఎపిసోడ్ లో ఏమి జరగబోతుంది అనేది.