https://oktelugu.com/

Bangarraju: ప్లాష్ బ్యాక్ లో నాగ్ తో రమ్యకృష్ణ.. ‘బంగార్రాజు’ ఏం చేస్తాడో ?

Bangarraju: అక్కినేని నాగార్జున ఎంతో ముచ్చట పడి చేస్తున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక రెండు షెడ్యూల్స్ ముగిస్తే దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుంది. అయితే, ఈ సినిమాలో ఒక ప్లాష్ బ్యాక్ ఉందని.. ఆ ప్లాష్ బ్యాక్ నాగార్జున – రమ్యకృష్ణ పాత్రల చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రమ్యకృష్ణ ఇరవై ఏళ్లు వెనక్కి పోయి ఈ సినిమాలో నటిస్తోందట. అంత గ్లామరస్ గా అలాగే అంత ఈజ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 17, 2021 / 07:33 PM IST
    Follow us on

    Bangarraju: అక్కినేని నాగార్జున ఎంతో ముచ్చట పడి చేస్తున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక రెండు షెడ్యూల్స్ ముగిస్తే దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుంది. అయితే, ఈ సినిమాలో ఒక ప్లాష్ బ్యాక్ ఉందని.. ఆ ప్లాష్ బ్యాక్ నాగార్జున – రమ్యకృష్ణ పాత్రల చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రమ్యకృష్ణ ఇరవై ఏళ్లు వెనక్కి పోయి ఈ సినిమాలో నటిస్తోందట. అంత గ్లామరస్ గా అలాగే అంత ఈజ్ తో ఈ సినిమా చేస్తోందట.

    Bangarraju

    ఏది ఏమైనా అందంలో అభినయంలో రమ్యకృష్ణ కు తిరుగులేదు. ఎనలేని తన అందాల నటనా ధారలతో తెలుగు వెండితెరను నిలువెల్లా తడుపుతున్న సీనియర్ ముద్దుగుమ్మ ఆమె. మూడు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తోంది. వయసు పెరిగినా ఇప్పటికీ బోల్డ్ పాత్రలు చేయడానికి సై అంటూ రెడీ అంటుంది.

    అందుకే గ్లామరస్ రోల్స్ లో ఆమె తర్వాతే ఎవరైనా అనే స్థాయి గుర్తింపును తెచ్చుకుంది రమ్యకృష్ణ. అలాగే భక్తిరస చిత్రాలతోనూ మెప్పించింది. ఇక ఎమోషనల్ క్యారెక్టర్స్ కు ఆమె పెట్టింది పేరు. బాహుబలిలో ఆమె ఎమోషన్ ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే కదా. ఇక ‘బంగార్రాజు’ విషయానికి వస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి బరిలో దించాలని సన్నాహాలు చేస్తున్నారు.

    అయితే, “ఆర్ఆర్ఆర్’, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు రేసులో ఉన్నాయి. మరి ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పిస్తారా ? లేక ధైర్యం చేసి రిలీజ్ చేస్తారా ? అనేది చూడాలి. సంక్రాంతి వేవ్ లో ‘బంగార్రాజు’ వస్తే.. లాస్ అయ్యేది ‘బంగార్రాజు’ మాత్రమే. అసలు సోలోగా వస్తేనే ‘బంగార్రాజు’కి కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయి అన్నది డౌట్.

    Also Read: Mokshagna: మోక్షజ్ఞ చేత భారీ యాక్షన్ చేయించబోతున్న బాలయ్య !

    అలాంటిది, పోటీలో.. అదీ భారీ చిత్రాల పై అంటే.. ఇక కష్టమే. పైగా గత నాలుగేళ్లలో నాగార్జున నటించిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న నాగార్జున సంక్రాంతి పోటీలో రావడం అవసరమా ? అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ‘బంగార్రాజు’ ఏమి చేస్తాడో ?

    Also Read: Radhe Shyam: రాధే శ్యామ్ సినిమాలో ఆ సీక్రెట్ ని రివీల్ చేసిన… డైరెక్టర్ రాధా కృష్ణ

    Tags