Dating Survey 2021: టెక్నాలజీ రోజురోజుకూ ఎంత పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెక్నాలజీ పెరుగుతుండడంతో అందరు ఆ పెరిగిన టెక్నాలిజీని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగ పడుతుందో.. అంతే కీడు కూడా చేస్తుంది. పెరుగుతున్న టెక్నాలజీ ని మంచికి ఉపయోగించుకునే వారి కంటే చెడ్డ దారులకు ఉపయోగించుకునే వారే ఎక్కువ అయ్యారు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరు స్మార్ట్ ఫోన్ లను, ఇంటర్నెట్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో ఈజీగా ఇంట్లో కూర్చుని తెలుసు కుంటునాన్రు. ముఖ్యంగా వీటి వాడకం వల్ల విదేశీ పద్ధతులపై యువతకు వ్యామోహం పెరుగుతుంది. విదేశీ కల్చర్ లో ఎక్కువుగా డేటింగ్ చేస్తూ ఉంటారు.
అయితే ఈ పద్ధతిని ఇప్పుడు మన యువత కూడా అలవాటు పడ్డారు. అంతేకాదు డేటింగ్ కోసం ఆన్లైన్ ఆప్ లను వాడుతున్నారు. ఈ కల్చర్ పెరిగిన తర్వాత మరిన్ని డేటింగ్ యాప్ పుట్టుకు రావడంతో యువత మరింత ఆకర్షితులవు తున్నారు. ఒకప్పుడు డేటింగ్ అనే మాట కూడా పలకడానికి మన ఇండియా వాళ్ళు ఇబ్బంది పడే వారు.. కానీ ఇప్పుడు అదే పదం ఒక కల్చర్ లాగా మారిపోయింది.
అందులోను మన తెలుగు వారు ఇలాంటి వాటికీ దూరంగా ఉంటారని అనుకుంటూ ఉంటాం.. కానీ ఇది ఒకప్పుడు ఇప్పుడు కాదని తాజాగా నిర్వహించిన సర్వే బయట పడింది. తాజాగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ డేటింగ్ లో మొదటి స్థానం రావడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ ఒక సర్వే నిర్వహించింది. ఏ సర్వేలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందట.
Also Read: Chanakya Niti: నిజమైన స్నేహితులలో ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి.. ఏవంటే?
తర్వాత స్థానాల్లో చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే ఉన్నాయట. 2021 జనవరి 1 నుండి నవంబర్ 30 వరకు టిండర్ సంస్థ ఈ సర్వే ను నిర్వహించింది. ఈ డేటింగ్ ఈ స్థాయిలో పెరగడానికి కరోనా కారణం అంటున్నారు. రెండేళ్లలో ఒకరినొకరు కలవలేని పరిస్థితి ఏర్పడడంతో ఈ డేటింగ్ లలో పాల్గొన్నారని తెలుపు తున్నారు.
Also Read: Success Story: వెయ్యి రూపాయల పెట్టుబడితో రూ.కోట్లు సంపాదిస్తున్న మహిళ.. ఎలా అంటే?