Pushpa: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమా రిలీజ్ కావడంతో తెలంగాణలో బెన్ ఫిట్ షోలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అర్దరాత్రి నుంచే బన్నీ ఫ్యాన్స్ నానా హంగామా సృష్టిస్తున్నారు. మొదటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అటు ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన వస్తుండటం, సోషల్ మీడియాలో కూడా కావాల్సినంత బజ్ రావడంతో పుష్ప జాతర కనిపిస్తోంది.

కాగా తెలంగాణలో ఇలాంటి మాస్ జాతర కనిపిస్తుండగా.. అటు ఏపీలో మాత్రం ప్రభుత్వం సినిమా చూపిస్తోంది. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా పుష్ప సినిమాకు పాత పద్ధతిలోనే టికెట్లు అమ్ముకునే చాన్స్ వచ్చింది. కానీ కోర్టు పర్మిషన్ ఇచ్చిన కొద్ది థియేటర్లకు మాత్రమే ఆ అవకాశం ఉంది. అన్ని థియేటర్లలో టికెట్లను పాత పద్ధతిలో అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఇక జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. అందులో డిసెంబర్ 8వ తేదీ నుండి 17వ తేదీ దాకా థియేటర్ యజమానులు పెట్టుకున్న వినతులను పరిశీలించి, వాటిమీద నిర్ణయం తీసుకునే ముందు తమకు నివేదిక పంపాలంటూ ఆర్డర్ వేసింది. అంటే జేసీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వానికి తెలుస్తుందన్న మాట. థియేటర్ల ఓనర్లకు సరైన లైసెన్స్ ఉందా కరెక్ట్ రూల్స్ పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు కూడా చేయాలని చెప్పింది.
Also Read: Mokshagna: మోక్షజ్ఞ చేత భారీ యాక్షన్ చేయించబోతున్న బాలయ్య !
అంటే థియేటర్లకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి జేసీలు పంపిస్తే అందులో ఏదో ఒక దానిమీద అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉందన్నమాట. అయితే టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఇది ఒక అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. కానీ కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు మాత్రం కోర్టు ద్వారానే ఆర్డర్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అయితే సోమవారం నాడు ఏదో ఒకటి తెలిసే అవకాశం ఉంది. మరి ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.
Also Read: Radhe Shyam: రాధే శ్యామ్ సినిమాలో ఆ సీక్రెట్ ని రివీల్ చేసిన… డైరెక్టర్ రాధా కృష్ణ