
‘వకీల్ సాబ్’ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియదు గానీ, ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రం ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. ముఖ్యంగా పవన్ స్పీచ్ ఆల్ టైం రికార్డు స్పీచ్ అవ్వగా.. పవన్ భక్తుడు బండ్ల స్పీచ్ మాత్రం అంతకుమించి అన్నమాదిరిగా తయారైంది. యూట్యూబ్ లో పవన్ స్పీచ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంది. ఆ తర్వాత నెంబర్ 2 స్థానంలో బండ్ల గణేష్ స్పీచ్ ట్రెండ్ అవుతూ ఉండటం నిజంగా విశేషమే. మొత్తానికి ఇలా తన బాస్ తో పాటుగా బండ్ల కూడా వైరల్ అవుతున్నాడు.
అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఒక టైంలో బండ్ల స్పీచే నెంబర్ 1 లోకి రావడం, ఏకంగా పవన్ స్పీచ్ ను వెనక్కి నెట్టి, బండ్ల గణేష్ స్పీచ్ టాప్ వన్ లో రావడంతో పవన్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. దాంతో పవన్ యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కంటే.. బండ్ల గణేష్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా పవర్ స్టార్ కి ఎంతమంది భక్తులు ఉన్నా సరే..పరమ భక్తుడు మాత్రం బండ్ల గణేషే. అవకాశం దొరికినప్పుడల్లా బండ్ల గణేశ్ పవన్‌కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా బాహాటంగా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు.
బండ్ల గణేశ్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కావొచ్చు. కానీ ప్రస్తుతం బండ్ల ఒక నిర్మాత. పైగా సక్సెస్ లు తీసిన నిర్మాత. మిగిలిన స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసిన నిర్మాత. అలాంటి నిర్మాత అయి ఉండి కూడా ఒక హీరోని ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ తన దేవుడితో పోలుస్తూ పొగడ్తల వర్షం కురిపించడం అంటే.. అది ఒక్క బండ్లకు మాత్రమే చెల్లింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన వ్యసనం అని, వెంకన్నకు అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడిలా నేను పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని గొప్పగా చెప్పుకోవడం కూడా బండ్లకే సాధ్యం అయింది.