Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి ఒక మార్క్ ఉంది. ఛాన్స్ దొరికితే పూనకం వచ్చినట్లు పొగుడుతాడు అని, నోటికి ఎంత మాట వస్తే, అంత మాట అనేస్తాడు అని బండ్ల పై బలమైన మార్క్ ఉంది. దానికి తగ్గట్టుగానే బండ్ల కూడా తన నైజాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే వచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పై క్రేజీ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా మెగాస్టార్ స్టైల్ గురించి బండ్ల పోస్ట్ చేసిన మెసేజ్ లు చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్ ఫీల్ అయిపోయారు. సాధారణ ప్రేక్షకులు సైతం బండ్ల గణేష్ ఇంత గొప్పగా రాయగలడా ? అంటూ షాక్ అవుతున్నారు. ఇక నెటిజన్లు అయితే.. బండ్ల లో గొప్ప డైలాగ్ రైటర్ ఉన్నాడని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇంతకీ బండ్ల గణేష్ ఏం పోస్ట్ చేశాడు ?, ఎందుకు ఆ పోస్ట్ లు విపరీతంగా వైరల్ అవుతున్నాయో చూద్దాం.
Also Read: Minister Roja Comments: చూసుకోండబ్బా.. జబర్ధస్త్ పై మంత్రి రోజా అనూహ్య కామెంట్స్
ముందుగా బండ్ల, చిరు గురించి ఏం ట్వీట్ చేశాడంటే..
‘‘ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం..
ఈ స్టైల్ చూసే మేం సినిమా రంగం వైపు పరుగులు తీశాం..
ఈ స్టైల్ చూసే మా జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది..
ఇక్కడ ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకం కల్పించుకున్నాం.
ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా.. ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చాం..
ఈ స్టైల్ చూసే అందరం మీకు అభిమానులుగా మారిపోయాం.
మీరు ఎప్పటికి ఈ స్టైల్లోనే ఉండాలని మా కోరిక,
ఎందరికో భరోసా.. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్ అంటే మాకు ఇష్టం’’ అని బండ్ల గణేష్ ట్వీట్స్ చేశాడు.
Also Read:Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా నిర్మాత అరాచకపర్వం..!?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీకి అభిమానుల రూపంలో ఎంతమంది ఉన్నా.. వారందరికంటే తానే పవర్ ఫుల్ అభిమాని అని బండ్ల మరోసారి బలంగా నిరూపించుకున్నాడు. మెగా ఫ్యామిలీ పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని బండ్ల మళ్లీ ఘనంగా చాటుకున్నాడు. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తాను పరమ భక్తుడ్ని అని బలంగా చెప్పుకునే బండ్ల గణేష్.. రీసెంట్ గా పవన్ పై కూడా ఇలాగే తన అభిమానాన్ని చూపించాడు. పవన్ పై కూడా బండ్ల గణేష్ ట్వీట్స్ చేశాడు. ‘నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్ గారు.. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్’ అని పోస్ట్ చేశాడు. అలాగే మరో ట్వీట్ చేస్తూ.. ‘పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే’ అని మెసేజ్ పెట్టాడు.
అసలు ఎందుకు బండ్ల గణేష్ సడెన్ గా ఈ ట్వీట్ల పై పడ్డాడు..?, నిర్మాతగా పవన్ తో ఓ సినిమా చేయాలని బండ్ల గణేష్ ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. కానీ, ప్రస్తుతం పవర్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ తో సినిమా చేసే ఛాన్స్ రాకపోవచ్చు. అదే మెగాస్టార్ విషయానికి వస్తే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందుకే, బండ్ల గణేష్ మెగాస్టార్ కి దగ్గరయ్యే పోగ్రామ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్వీట్స్ చేశాడు. మెగాస్టార్ కోసం బండ్ల సీరియస్ గా మంచి కథ కోసం రైటర్స్ పై పడ్డాడు. అద్భుతమైన కథ తీసుకువెళ్తే.. తనకు చిరు డేట్లు ఇస్తాడని బండ్ల నమ్మకం. మరి బండ్ల నమ్మకం నిజం కావాలని కోరుకుందాం.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Bandla ganeshs sensational comments on megastar did bandla actually write this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com