Balayya NTR Combo: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. వీళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని పాన్ ఇండియాలో భారీ రేంజ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా నందమూరి ఫ్యామిలీ హీరోలు అయిన బాలయ్య బాబు (Balayya Babu), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాత్రం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు వాళ్లకు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. ఇక బాలయ్య బాబు సీనియర్ హీరోలెవ్వరికీ అందనంత రేంజ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు చేస్తున్న ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర (Devara) సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టిన ఆయన హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమాతో మరోసారి పెను రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమాతో ఇండియాలోనే ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య లను పెట్టి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: Balayya : బాలయ్య ఆ దర్శకుడిని పక్కన పెట్టడానికి కారణం ఏంటి..?
వైజయంతి మూవీస్(Vaijayanthi Movies) బ్యానర్ అధినేత అయిన సి అశ్వినీ దత్ (Ashwini Dath) బాలయ్య – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. వీళ్ళిద్దరి ఇమేజ్ కి తగ్గట్టుగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దగ్గర ఒక కథ కూడా ఉందని ఆ కథతో సినిమా చేస్తే ఇండస్ట్రీలో రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ కథతో ఒకవేళ సినిమా వస్తే (Nag Ashwin) ఈ సినిమాను డైరెక్షన్ చేస్తాడా? లేదా ఇంకెవరైనా డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారికి వీళ్లిద్దరిని కలిపెంత చనువు అయితే ఉంది. మరి ఆయన కనక వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేసినట్టయితే మాత్రం అది నందమూరి అభిమానులందరికి పెద్ద పండగ అవుతుందనే చెప్పాలి…