https://oktelugu.com/

నంద్యాలలో భారీ ఫైట్ చేయబోతున్న బాలయ్య !

బాలయ్య – బోయపాటి సినిమా కూడా వచ్చే వారం నుండి నంద్యాలలో షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అందుకు ప్రత్యేకంగా ఒక సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సెట్ లో ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయలేని పరిస్థితి. అందుకే నంద్యాలలో సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఇక ఈ […]

Written By:
  • admin
  • , Updated On : November 7, 2020 / 05:48 PM IST
    Follow us on


    బాలయ్య – బోయపాటి సినిమా కూడా వచ్చే వారం నుండి నంద్యాలలో షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అందుకు ప్రత్యేకంగా ఒక సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సెట్ లో ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయలేని పరిస్థితి. అందుకే నంద్యాలలో సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనదట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో భారీ సెట్ వేసి షూట్ చేయాలని బోయపాటి ఫిక్స్ అయ్యారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    నిజానికి మొన్నటివరకూ ఈ సీక్వెన్స్ ను యాదగిరిగుట్టలో ప్లాన్ చేశారు. వారణాసి నేపథ్యాన్ని మార్చి.. యాదగిరిగుట్ట నేపథ్యాన్ని తీసుకున్నారు. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బాలయ్య పాత్ర హోమం చేయిస్తూ ఉండగా విలన్స్ అటాక్ చేస్తారట. అయితే భారీ ఫైట్ సీన్స్ ఉండటంతో అక్కడ చేయడం రిస్క్ అని.. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సెట్ వేసి నంద్యాలలో షూటింగ్ ప్లాన్ చేశారు. అన్నట్లు ఈ సీన్స్ లోనే విలన్స్ ను చంపే ప్రయత్నంలో సీనియర్ బాలయ్య పాత్ర కూడా ఇక్కడే చనిపోతుందని.. మొత్తానికి ఈ సీక్వెన్స్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని సమాచారం.

    Also Read: ‘రాధేశ్యామ్’పై ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

    ఇక పర్సనల్ గా బాలయ్యకి ఈ సీక్వెన్స్ బాగా నచ్చిందట. అందుకే ఆయన ముందుగా ఈ సీక్వెన్స్ చేద్దామని పట్టుబట్టి మరీ వచ్చే వారం షూటింగ్ పెట్టిస్తున్నారట. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అది సాధ్యమయ్యేలా లేదు. బాలయ్య పక్కన ఆ కొత్త హీరోయిన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదని.. ఆ కారణంగానే హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.