https://oktelugu.com/

‘వకీల్ సాబ్’ను దిల్ రాజు వసూల్ సాబ్ గా మారుస్తాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పుల్ బీజీగా మారాడు. వరుసగా నాలుగైదు సినిమాలు చేస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ మూవీని తెలుగులో ‘వకీల్ సాబ్’గా రాబోతుంది. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కరోనా ఎఫెక్ట్ ‘వకీల్ సాబ్’ మూవీపై పడటంతో సినిమా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 05:44 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పుల్ బీజీగా మారాడు. వరుసగా నాలుగైదు సినిమాలు చేస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ మూవీని తెలుగులో ‘వకీల్ సాబ్’గా రాబోతుంది. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా ఎఫెక్ట్ ‘వకీల్ సాబ్’ మూవీపై పడటంతో సినిమా వాయిదా పడింది. తాజాగా ఈమూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ‘వకీల్ సాబ్’ను త్వరగా పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. దీంతో ఈ మూవీ సంక్రాంతికి రిలీజు కానుందని టాక్ విన్పిస్తోంది.

    Also Read: బన్నీని ఢీకొట్టడానికి వస్తున్న బాలీవుడ్ నటుడు..!

    ఇటీవల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. సంక్రాంతి వరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచాయి.

    ‘వకీల్ సాబ్’ చిత్రయూనిట్ మాత్రం సినిమా సంక్రాంతి వస్తుందా? రాదా? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీనిని క్యాష్ చేసుకోవాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే దిల్ రాజు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ‘రాధేశ్యామ్’పై ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

    దీంతో ఈ మూవీని ప్రస్తుతం రిస్కు తీసుకొని విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. లేకపోతే పరిస్థితులన్నీ చక్కబడ్డాక వేసవిలో సినిమాను విడుదల చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై చిత్రయూనిట్ అభిమానులకు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచిచూడాల్సిందే..!