https://oktelugu.com/

Balayya babu : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నుండి వచ్చిన 'డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం కూడా కమర్షియల్ గా హిట్ అనిపించుకున్న సంగతి తెలిసిందే.

Written By: , Updated On : February 19, 2025 / 12:27 PM IST
Balayya babu

Balayya babu

Follow us on

Balayya babu : హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నుండి వచ్చిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం కూడా కమర్షియల్ గా హిట్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. బాలయ్య కెరీర్ లో ఈ చిత్రం లో ‘జైలర్’ లాంటి సినిమా అని చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తారు. కచ్చితంగా 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు కానీ, పండగ సెలవుల తర్వాత కలెక్షన్స్ బాగా తగ్గిపోవడం తో 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ చిత్రం ఈ నెల 21 నుండి నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రానుంది.

కేవలం తెలుగు లో మాత్రమే కాదు హిందీ,తమిళం,మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూడొచ్చు. అయితే ప్రతీ సినిమాకి ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ సినిమా రన్ టైం ని దృష్టిలో పెట్టుకొని వాటిని తొలగించాల్సి వస్తుంది. అలా ఈ చిత్రానికి కూడా జరిగింది. కొన్ని ఫైట్ సన్నివేశాలను రన్ టైం ని దృష్టిలో పెట్టుకొని కట్ చేశారట. అవి ఓటీటీ వెర్షన్ లో జత చేసి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సన్నివేశాల నిడివి దాదాపుగా 15 నిమిషాల వరకు ఉంటుందని అంచనా. ‘పుష్ప 2’ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి అయిన తర్వాత, ఆ సినిమా నుండి తొలగింపబడ్డ కొన్ని కీలక సన్నివేశాలను జత చేసి మరోసారి థియేటర్స్ లో విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘డాకు మహారాజ్’ కి థియేటర్ వెర్షన్ లో ఆ అవకాశం దొరకలేదు కానీ, ఓటీటీ వెర్షన్ లో మాత్రం ఆ సన్నివేశాలను జత చేసి నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేయబోతున్నారట. ఈ సన్నివేశాలు మరింత మాస్ గా ఉంటాయని, బాలయ్య అభిమానులకు కనుల పండగే అని అంటున్నారు. చూడాలి మరి ఈ సన్నివేశాలకు మన ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఇకపోతే బాలయ్య ఈ చిత్రం విడుదల తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా సాగుతుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడని టాక్. అదే విధంగా ఆది పినిశెట్టి మరో విలన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.