https://oktelugu.com/

Deputy CM Pawan Kalyan: పవన్ ఒంటిపై జంధ్యం.. కారణం అదే!

సాధారణంగా బ్రాహ్మణులు జంధ్యం ధరిస్తారు. క్షత్రియులు, వైశ్యులకు సైతం జంధ్యం ఉంటుంది. అటువంటిది పవన్ కళ్యాణ్ ఒంటిపై కనిపిస్తుండడం విశేషం.

Written By: , Updated On : February 19, 2025 / 12:06 PM IST
Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు( Mahakumbh Mela ) వెళ్లారు. ప్రయాగరాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించారు. భార్య, కుమారుడు అకిరా నందన్ తో కలిసి పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమానికి హారతులు ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించే సమయంలో ఆయన శరీరంపై కనిపిస్తున్న జంధ్యం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఒంటిపై జంధ్యం ఎందుకు ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ జంధ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ నడుస్తోంది. విభిన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు కాదు. అటువంటప్పుడు జంధ్యం ఎందుకు ధరించారు అన్నది ఇప్పుడు ప్రశ్న.

* భారీగా భక్తులు
కుంభమేళా( Kumbh Mela) భారీగా జరుగుతోంది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో పాల్గొంటే మంచిదన్న సెంటిమెంట్ నడుస్తోంది. ఈనెల 26 వరకు కుంభమేళా కొనసాగనుంది. అయితే కాశీ, ప్రయాగ వెళ్లినప్పుడు పిండ ప్రదానాలు చేస్తుంటారని… ఆ సమయంలో ఎవరికైనా.. ఏ వర్ణం వారి కైనా అక్కడి బ్రాహ్మణులు జంధ్యం ఇస్తుంటారట. ఒకవేళ జంధ్యం అందుబాటులో లేకపోతే కండువాను జంధ్యంలా మార్చి కూడా వేస్తుంటారట. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయన దీక్షలో ఉన్నారు. కాబట్టి దీక్షలో ఉన్నవారు కూడా ఇస్తారని మరో చర్చ నడుస్తోంది.

* గతంలో దీక్షల సమయంలో..
గతంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) చాలా రకాల దీక్షలు చేపట్టారు. ఆ సమయంలో కూడా ఆయన శరీరంపై జంధ్యం ఉండడాన్ని చాలామంది గుర్తు చేస్తున్నారు. వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రుల సమయంలో కూడా జంధ్యం ధరిస్తుంటారని దగ్గరి వర్గాలు చెబుతున్నాయి. ఆ దీక్షలు చేసే సమయంలో 41 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ.. మాంసాహారానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు కాపులు యజ్ఞోపవీతం జంధ్యం ధరిస్తారు అని కూడా ఒక ప్రచారం ఉంది. అలాగే జంధ్యం వేసుకోవడం వైదిక సాంప్రదాయం అని.. బలిజల్లో క్షత్రియ బలిజలు జంధ్యం ధరిస్తారని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ జంధ్యం ధారణ పై రకరకాల చర్చ నడుస్తుండడం విశేషం.