spot_img
Homeఎంటర్టైన్మెంట్Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య...

Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య…

Mokshagna: నందమూరి నట సింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ బాలయ్య ఎక్కడ తగ్గకుండా మొదట్లో ఎలాగైతే దూకుడుగా సినిమాలు చేసేవాడో, ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శిస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన మోక్షజ్ఞా సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద ఇప్పటివరకైతే సరైన క్లారిటీ రాలేదు.

నిజానికి మోక్షజ్ఞ రెండు సంవత్సరాల కిందటే ఒక భారీ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా లేటవుతూ వస్తుంది. మరి ఈ సంవత్సరం అయిన మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య ఇప్పుడు నందమూరి అభిమానులకు ఒక తీపి కబురు చెప్పాడు.

అదేంటి అంటే మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ మొత్తం రెడీ అయినట్టుగా తెలియజేశాడు. అలాగే ఈ సమ్మర్ నుంచి మోక్షజ్ఞ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్ళబోతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనే దానిమీద క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, మోక్షజ్ఞ సినిమా మాత్రం ఈ సమ్మర్ నుంచి సెట్స్ మీదికి వెళ్లి, ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బాలయ్య బాబు చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడాడు.

అయినప్పటికీ అవి ఏవి కూడా పాజిబుల్ కాలేదు. మరి ఈసారి అయిన బాలయ్య మాటలు నిజం అవుతాయా లేదంటే ఫాన్స్ కి ఊరట ను ఇవ్వడానికి ఊరికే బాలయ్య అలా చెప్తున్నాడా అని కూడా కొంతమంది బాలయ్య అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు మాత్రం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇది ఫుల్ మాస్ సినిమాగా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అది ఊర మాస్ రేంజ్ లో ఉండటమే కాకుండా బాలయ్య బాబు నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version