Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య ను 20 ఏళ్ల కుర్రాడిగా చూపించనున్న స్టార్ డైరెక్టర్...

Balakrishna: బాలయ్య ను 20 ఏళ్ల కుర్రాడిగా చూపించనున్న స్టార్ డైరెక్టర్…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా అతని అభిమానులు ఆయన నుంచి ఏం కావాలనుకుంటున్నారో అది ఇవ్వడానికే ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడం ఆయనకి కొత్తేమీ కాదు. కానీ ప్రేక్షకులు ఆ సినిమాలను చూస్తున్నారా? లేదా తను నుంచి అభిమానులు, ప్రేక్షకులకు ఏం కోరుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని అలాంటి సినిమాలను వాళ్ళ ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు డీలా పడ్డాడు. అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సైతం ఇంకో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తొందరలోనే ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన తమిళ్ డైరెక్టర్ ఆయన హరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే హరి దర్శకత్వ లో రాబోయే సినిమా మరొకెత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇందులో బాలయ్య మనకు 20 ఏళ్ల కుర్రాడి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు.

ఏఐ ద్వారా ఆ లుక్ క్రియేట్ చేస్తారా? లేదంటే ఇంకేదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే బాలయ్య తన 20 ఏళ్ల వయసులో చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు. మరి అలాంటి లుక్కుని మరోసారి రీ క్రియేట్ చేయగలుగుతారా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత హరి దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా ఉండబోతుందనే అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది. ఈ సినిమాలను బాలయ్య ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఇక మూవీ షూట్ తర్వాత ఇంకొకటి చేస్తాడా? లేదంటే రెండు మూడు సినిమాల షూటింగ్స్ ను ఒకేసారి చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular