Alekhya Chitti Pickles Ramya: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ అంటూ భారీ హైప్ తో 6 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టారు. కానీ వీరిలో ముగ్గురు ఇప్పటికే హౌస్ ని వదిలి వెళ్లిపోయారు. అయేషా,రమ్య ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అవ్వగా, నేడు దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యింది. రేపు నిఖిల్,సాయి మరియు గౌరవ్ నామినేషన్స్ లోకి వస్తే వీరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. గత సీజన్ లో వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కాన్సెప్ట్ పెద్ద ఫ్లాప్ అయ్యింది. నిఖిల్, గౌరవ్ కాస్త టాస్కులు ఆడేలాగానే అనిపిస్తున్నారు కానీ, వీళ్లకు తమని తాము నిరూపించుకునే అవకాశాలు రావడం లేదు. ఇది కాసేపు పక్కన పెడితే అలెక్ష్య చిట్టి పికిల్స్ రమ్య పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉండేవి.
ఎందుకంటే ఈమె చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది, అంతే కాకుండా చాలా బోల్డ్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. కాబట్టి ఈమె బిగ్ బాస్ హౌస్ కి కరెక్ట్ గా సరిపోతుంది, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి దడపుట్టిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈమె హౌస్ లోకి అడుగుపెట్టింది తనూజ ని బ్యాడ్ చేయడానికే అన్నట్టుగా ఆడియన్స్ కి ప్రాజెక్ట్ అయ్యింది. అంతే కాకుండా సోషల్ మీడియా లో ఈమె లుక్స్ గురించి ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. వీటి అన్నిటికీ సమాధానం చెప్తూ ఆమె రీసెంట్ గానే ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో లో ఆమె మాట్లాడిన మాటలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ లోపల జరిగింది వేరు, జనాలకు చూపించింది వేరు. నన్ను బ్యాడ్ చేసి పంపడానికి బిగ్ బాస్ కి పిలిచినట్టు అనిపించింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు నేను ఒరిజినల్ గానే ఉన్నాను. నాకు హౌస్ లో ఉన్న నీళ్లు పడక చాలా ఇబ్బంది పడ్డాను. జ్వరం కూడా వచ్చింది. ఆరోగ్యం మరింతగా దెబ్బతినడం తో నా దవడలు లావయ్యాయి. అందుకే కొన్ని చోట్ల నా ముఖం రౌండ్ గా కనిపిస్తుంది. దీంతో నా లుక్స్ పై సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్స్ వేశారు. ఇలాంటి ట్రోల్స్ నాకు కొత్తేమి కాదు. బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు నాకు డబ్బులు మంచిగా ఇచ్చారు. సినిమా అవకాశాలు కూడా వరుసగా వస్తున్నాయి. కానీ మీరే పనిపాట లేకుండా నాపై ట్రోల్స్ వేస్తూ కూర్చున్నారు’ అంటూ తనపై ట్రోల్స్ వేసిన వాళ్లకు చాలా గట్టిగ కౌంటర్ ఇచ్చింది రమ్య.