https://oktelugu.com/

Balakrishna: ఆస్పత్రిలో బాల‌య్య‌.. ఏమైంది? ఫ్యాన్స్ లో ఆందోళన

Balakrishna: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్ గానే అఖండ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిందు అందుకున్న ఆయ‌న‌.. వ‌రుస పెట్టి పెద్ద సినిమాలు చేస్తున్నారు. సినిమాల ప‌రంగా బాల‌య్య‌కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న‌కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే.. ఆయ‌న స్థాయి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా బాల‌య్య రీమేక్ సినిమాల కంటే కూడా.. కొత్త క‌థ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే ఆయ‌న ప్ర‌తి సినిమాలో […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 26, 2022 / 09:51 AM IST
    Follow us on

    Balakrishna: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్ గానే అఖండ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిందు అందుకున్న ఆయ‌న‌.. వ‌రుస పెట్టి పెద్ద సినిమాలు చేస్తున్నారు. సినిమాల ప‌రంగా బాల‌య్య‌కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న‌కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే.. ఆయ‌న స్థాయి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

    Balakrishna

    ముఖ్యంగా బాల‌య్య రీమేక్ సినిమాల కంటే కూడా.. కొత్త క‌థ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే ఆయ‌న ప్ర‌తి సినిమాలో కొత్త‌ద‌నాన్ని మ‌నం చూడొచ్చు. ఆయ‌న సినిమాల్లో ఎక్కువ‌గా యాక్ష‌న్ సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్లు క‌నిపిస్తుంటాయి. సినిమాల కోసం ఎంత క‌ష్టాన్ని అయినా భ‌రిస్తారు బాల‌య్య‌. అందుకే ఆయ‌న‌కు గ‌తంలో కొన్ని స‌ర్జ‌రీలు కూడా అయ్యాయి.

    Also Read: Ananya Panday: ఘాటు అందాల సంకెళ్లు వేస్తున్న అన‌న్య పాండే.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌..

    రీసెంట్ గానే భుజానికి స‌ర్జరీ చేయ‌గా.. కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో స‌ర్జ‌రీ చేయించుకున్న వార్త ఫ్యాన్స్‌ను ఆందోళ‌న‌లో ప‌డేసింది. ఆయ‌న హాస్పిట‌ల్ లో దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో చెక్క‌ర్లు కొడుతోంది. ఇందులో ఆయ‌న మోకాళికి క‌ట్టు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఆయ‌న‌కు ఏమైంద‌నే టెన్ష‌న్ మొద‌లైంది.

    Balakrishna

    ఆయ‌న చాలా రోజుల నుంచి మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. స‌ర్జీరీ చేయాలంటూ గ‌తంలోనే డాక్ట‌ర్లు చెప్పారు. కానీ ఆయ‌న ఇన్ని రోజులు చేయించుకోలేదు. కానీ నొప్పి ఎక్కువ కావ‌డంతో డాక్ట‌ర్లు ఆయ‌న‌కు నిన్న మైన‌ర్ స‌ర్జ‌రీ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఎలాంటి టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు డాక్ట‌ర్లు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు.

    Also Read:YCP Ministers: నాటి ఫైర్ ఏదీ?.. తేలిపోతున్న వైసీపీ మంత్రు ప్రెస్ మీట్లు

    Recommended Videos:

    Tags