https://oktelugu.com/

Kapu Politics: రాక్షక క్రీడకు తెరతీసిన జగన్.. కాపు సామాజికవర్గంలో రాజకీయ చిచ్చు

Kapu Politics: రాష్ట్రంలో ఒక విక్రుత రాక్షస క్రీడకు తెరతీశారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రతిబంధకంగా మారుతారని జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. దారికి తెచ్చుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాపు సామాజికవర్గం పవన్ వెంట నడవకుండా ఉండేందుకు ఆ వర్గంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాజకీయంగా పవన్ దూకుడు పెంచడంతో జగన్ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పవన్ తన కంట్లో నలుసుగా మారారని నొచ్చకుంటున్నారు. […]

Written By:
  • Admin
  • , Updated On : April 26, 2022 / 10:01 AM IST
    Follow us on

    Kapu Politics: రాష్ట్రంలో ఒక విక్రుత రాక్షస క్రీడకు తెరతీశారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రతిబంధకంగా మారుతారని జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. దారికి తెచ్చుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాపు సామాజికవర్గం పవన్ వెంట నడవకుండా ఉండేందుకు ఆ వర్గంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాజకీయంగా పవన్ దూకుడు పెంచడంతో జగన్ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పవన్ తన కంట్లో నలుసుగా మారారని నొచ్చకుంటున్నారు. పవన్ రైతుభరోసా యాత్రల పేరిట జనాల్లోకి వస్తుండడం, యువత ఆదరణ పెరుగుతుండడం, పవన్ పొత్తుల ప్రకటన చేస్తుండడంతో జగన్ లో అభద్రతా భావం పెరిగిపోయింది. ఓటమి భయం పట్టకుంది. దీంతో తనకు అచ్చొచ్చిన కుల రాజకీయాలకు తెరతీశారు. తాజాగా తన కేబినెట్ లోకి తీసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజాలను పురిగొలిపారు. అధినేత ఇచ్చిన టాస్కును పూర్తిచేయాలన్న ఆత్రుతతో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా విపరీత వ్యాఖ్యానాలు చేశారు. కుటుంబసభ్యులను తెరపైకి తెచ్చి కించపరుస్తూ మాట్లాడారు. దీనిపై జన సైనికులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సామాజికవర్గం నాయకులు, ప్రతినిధులు సైతం స్పందించారు. ఆ ముగ్గురు మంత్రుల తీరును తప్పుపట్టారు. వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు.

    Jagan

    అయితే ముగ్గురు మంత్రుల తీరును జన సైనికులు, పవన్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో విమర్శలు కురిపిస్తున్నారు. వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రులు తరచూ పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతుండడం తో కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిత్వ, కుటుంబ గౌరవ హననానికి పాల్పడుతుండడంతో జనసైనికులు తెగ బాధపడుతున్నారు. ఆ ముగ్గురి కుటుంబాలను కూడా తెరపైకి తెచ్చి జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ శైలిపై విశాఖలో ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఆయన విలాస జీవితంపై రకరకాల కథనాలున్నాయి. ఆయన తరచూ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటాడన్న టాక్ ఉంది.

    Also Read: YCP Ministers: నాటి ఫైర్ ఏదీ?.. తేలిపోతున్న వైసీపీ మంత్రు ప్రెస్ మీట్లు

    JAGAN

    తరచూ శ్రీలంక సందర్శిస్తుంటారని కూడా అనుచరులు చెబుతుంటారు. గత ఎన్నికలు ముగిసిన తర్వాత శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కూడా ఆయన శ్రీలంకలోనే ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఆయన అనేక మంది మహిళలతో సరదాగా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు జన సైనికుల చేతికి చిక్కాయి. తమ అధినేతపై వ్యాఖ్యలు చేశారన్న కోపంతో ఇప్పుడు అదే ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఓ ఫంక్షన్లో భార్యతో కలిసి చేసిన డాన్స్‌ వీడియోలను కూడా ట్యాగ్ చేస్తున్నారు. వాటిపై విమర్శల జడివాన రూపంలో కామెంట్లు చేస్తున్నారు. . దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబులను కూడా వదిలి పెట్టడం లేదు. వీరి ముగ్గురి ఫోటోలతో దారుణంగా ఫ్లెక్సీలు తయారు చేసి విశాఖలో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం జగన్ మాత్రం తాను అనుకున్నది సాధించారు. అటు పవన్, ఇటు కాపు మంత్రులు పరస్పరం వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంతో వచ్చిన మంటను జగన్ కాగుతున్నారు.

    Also Read:Elon Musk: ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. ఇకనైనా ‘వాక్ స్వాతంత్య్రం’ వచ్చేనా?
    Recommended Videos


    Tags