Homeఎంటర్టైన్మెంట్Samarasimha Reddy: బాలయ్య మామూలోడు కాదు.. ఇన్ని పట్టేసాడా?

Samarasimha Reddy: బాలయ్య మామూలోడు కాదు.. ఇన్ని పట్టేసాడా?

Samarasimha Reddy: టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఒకప్పడు బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకున్న సినిమాలు ప్రస్తుతం థియేటర్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ నెల మొదటి వారంలో స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహా రెడ్డి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

బాలకృష్ణ, దర్శకుడు బి. గోపాల్ కాంబోలో తెరకెక్కిన సమరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించి ప్రొడ్యూసర్లకు ఫుల్ గా లాభాలను ఆర్జించి పెట్టింది. తెలుగులో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలలో ఈ సినిమా సెన్సేషన్ గా నిలిచింది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే.. సిమ్రాన్, అంజలా ఘవేరి, సంఘవి హీరోయిన్ లుగా నటించారు. జయప్రకాష్ రెడ్డి విలన్ పాత్రలో అదరగొట్టారు. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ సినిమా అప్పట్లో 29 సెంటర్లలో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది. ఇక బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాదు ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మార్చి 2న తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కర్ణాటకలో కూడా రీరిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమా కోసం ఎక్కువ థియేటర్సే వేయిట్ చేస్తున్నాయి.

నైజాంలో 100 దాకా స్క్రీన్స్ లో విడుదల చేయనున్నారు. ఆంధ్రాలో 250 వరకు స్క్రీన్స్ లో రీరిలీజ్ కాబోతోంది సమరసింహారెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 350 వరకు స్క్రీన్స్ లో రీ రిలీజ్ చేయనుండగా, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 50 వరకు స్క్రీన్స్ లో రీరిలీజ్ కు సిద్దమైంది సినిమా. అంటే మొత్తంగా 400 థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది అన్నమాట.ప్లాన్స్ బాగానే ఉన్నా.. కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version