Balakrishna blockbuster films : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… చిరంజీవికి పోటీని ఇస్తూ ఎప్పటికప్పుడు తను కొత్త పంథాలో సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఘనత కూడా బాలయ్య బాబుకి దక్కుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఏజ్ లో కూడా ఆయన డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయామనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా వాడుకొని అద్భుతమైన సినిమాలను చిత్రీకరించిన వాళ్ళలో బి.గోపాల్ మొదటి స్థానంలో ఉంటాడు. పర్ఫెక్ట్ గా బాలయ్య ఇమేజ్ ను వాడుకొని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాడు. ఆయన చేసిన సినిమాల్లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు ఉండడం విశేషం…
ఇక బోయపాటి శ్రీను సైతం బాలయ్య ఇమేజ్ ను చాలా పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. సింహ, లెజెండ్, అఖండ లాంటి మూడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాడు… ఇక వీళ్ళు మాత్రమే బాలయ్య ఇమేజ్ ను చాలా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఇక మిగిలిన దర్శకులు ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ లను సాధించి పెట్టినప్పటికి ఆయన పూర్తి ఇమేజ్ ను వాడుకున్న ఘనత మాత్రం బి గోపాల్, బోయపాటి శ్రీను లకు మాత్రం దక్కుతుంది.
ఇక రాబోయే రోజుల్లో వీళ్ళ లాగానే బాలయ్య బాబు ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా డీల్ చేయగలిగిన దర్శకులు ఎవరైనా దొరుకుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది…
