Balakrishna: బాలయ్య ఎన్టీయార్ కాంబోలో సినిమా సాధ్యమేనా..?

నందమూరి ఫ్యామిలీ అభిమానులందరూ బాలయ్య , ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని చాలా రోజుల నుంచి ముచ్చట పడుతున్నారు

Written By: Gopi, Updated On : February 25, 2024 7:46 am

Balakrishna

Follow us on

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో వాళ్ళ స్థానాన్ని పదిలంగా నిలుపుకున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఈ ఫ్యామిలీ మొత్తం భాద్యతలను భుజాన వేసుకొని ముందుకు తీసుకెళుతున్నారు.ఇక వీళ్ళను మినహాయిస్తే వీళ్ళ ఫ్యామిలీ నుంచి మిగిలిన ఏ హీరో కూడా పెద్దగా సక్సెస్ అయితే కాలేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కొన్ని విభేదాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని ఏ ఫంక్షన్ కి పిలవడం లేదు.

అసలు వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకోవాలనే ఉద్దేశ్యం లో కూడా బాలయ్య లేనట్టు గా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యామిలీ అభిమానులందరూ బాలయ్య , ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని చాలా రోజుల నుంచి ముచ్చట పడుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ కాంబో లో సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ సినిమా రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల బాలయ్య ఆ క్యారెక్టర్ లో చేయలేదు. దాంతో మలయాళ నటుడు అయిన మోహన్ లాల్ ను ఆ పాత్రలో నటింపజేశారు.ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు కలిసి పోతే తప్ప వీళ్ళిద్దరి కాంబో లో సినిమా అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలయ్య కూడా బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో నందమూరి అభిమానులు సంతృప్తి చెందుతున్నప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే చూడాలని వాళ్ళు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు…