Horoscope Meeting : ఈ రాశి ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు..

ఆదివారం చంద్రుడు సింహా రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు కొత్త వ్యక్తులను కలుస్తారు. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Written By: Chai Muchhata, Updated On : February 25, 2024 9:13 am

Horoscope Today

Follow us on

Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 25న ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం చంద్రుడు సింహా రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు కొత్త వ్యక్తులను కలుస్తారు. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఏదైనా వివాదాలు ఎదురైతే ఓపికగా ఉండాలి. ఇంటికి సంబంధించిన సమస్యలను వెంటనేపరిష్కరించుకోవాలి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు శుభవార్తలు వింటారు.

వృషభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు కొత్తవ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది.

మిధునం:
పెండింగు పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు లాభాలు వస్తాయి. కొన్ని విషయాల్లో సమస్యలు తొలగిపోయి మానసకి ప్రశాంతత నెలకొంటుంది.

కర్కాటకం:
ఎవరికైనా డబ్బు ఇస్తే అవి రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సింహ:
రాజకీయాల్లో ఉన్నవారు కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు.

కన్య:
కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆందోళన నెలకొంటుంది. ఉద్యోగులు తోటి వారితో సంయమనంగా పాటించాలి.

తుల:
ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వివాదాలు ఉండే ఛాన్స్. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులతో చర్చించాలి. పాత స్నేహితులను కలుస్తారు.

వృశ్చికం:
కొన్ని పనుల్లో ఇబ్బందులు తప్పవు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందువల్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు.

ధనస్సు:
వ్యాపారులు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వస్తాయి. ఆర్థిక పరమైన చిక్కులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మకర:
ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొంటారు. కొందరి వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు.

కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు సీనియర్లతో కొన్ని విషయాలను చర్చిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వివాదం ఏర్పడుతుంది.

మీనం:
ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆందోళన ఉంటుంది. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. ఓ సమస్యపై అందరు కలిసి చర్చిస్తారు.