Gold Rates Today: బంగారం ధరలు ఇలా ఉంటాయని అస్సలు ఊహించరు..

ఇంటర్నేషనల్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2038 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.97 డాలర్ల ట్రేడ్ అవుతోంది.

Written By: Chai Muchhata, Updated On : February 25, 2024 9:13 am

Shocking Gold Rates

Follow us on

Gold Price Today: శుభకార్యాలు జరుగుతున్న వేళ బంగారం ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి . కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో బంగారం ధరల్లో మార్పులు వచ్చాయి. ఇంటర్నేషనల్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2038 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.97 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 25వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 25న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. ఫిబ్రవరి 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారం కంటే ఆదివారం రూ.200 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,490తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,900గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వెండి ధరలు రూ.400 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,900గా ఉంది. ముంబైలో రూ..74,900, చెన్నైలో రూ.76,400, బెంగుళూరులో 71,500, హైదరాబాద్ లో రూ.76,400తో విక్రయిస్తున్నారు.