Doctor on Balayya health: అప్పట్లో ఆంధ్రజ్యోతిలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్తలపై నిషేధం ఉండేది. చివరికి ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఆంధ్రజ్యోతిలో కనిపించేవి కాదు. బహుశా ప్రకటనలు ఇవ్వకపోవడం వల్లే ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడం లేదని అందరూ అనుకున్నారు. కానీ దానికి కారణం వేరే ఉంది. ఆ కారణం ఇదిగో ఇన్నాళ్లకు ఇప్పుడు తెలిసింది. కాకపోతే ఈ వీడియో ఇప్పుడు వెలుగు లోకి రావడమే ఆశ్చర్యం. దీనిని ఓ నెటిజన్ వెలుగులోకి తీసుకొచ్చాడు.
Also Read: సితార బర్త్ డే వేళ మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్… ఆ సీక్రెట్ బయటపెట్టిన సూపర్ స్టార్
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో తన చానల్లో ఒక టాక్ షో నిర్వహించేవాడు. సమాజంలో భిన్నమైన వర్గాలకు చెందిన వారితో ముఖాముఖి నిర్వహించి.. వారి జీవితంలో తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసేవాడు.. ఈ కార్యక్రమం వల్ల సమాజంలో గొప్పవారిగా వెలుగుతున్న వారి జీవితాల్లో అసలు కోణాలు బయటపడేవి. కొన్ని సందర్భాలలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం వివాదాస్పదమైన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే వేమూరి రాధాకృష్ణకు ఇటువంటివి కావాలి కాబట్టి.. వచ్చిన గెస్టులను ఇదే తరహా ప్రశ్నలు అడిగి నిజాలు రాబట్టేవాడు. వేమూరి రాధాకృష్ణ ఇలా చిత్రమైన ప్రశ్నలు అడిగి.. సమాధానాలు రాబట్టిన వ్యక్తుల్లో నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఒకరు.. కాకర్ల సుబ్బారావు పేరుపొందిన వైద్యులు. నిమ్స్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేశారు. కీలకమైన కేసులను టాకిల్ చేశారు. సుప్రసిద్ధ వైద్యుడిగా పేరుపొందారు. ఆయనను వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు.
అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన చోటు చేసుకున్నప్పుడు.. బాలకృష్ణను నిమ్స్ తరలించారు. కాల్పుల సంఘటన చోటుచేసుకున్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో ఓ నిర్మాత ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనకు బుల్లెట్ గాయాలు అయినట్టు కూడా సమాచారం. అయితే ఇందులో చాలా విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ సంఘటనను షుగర్ కోటెడ్ మాదిరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. సాక్షి మాత్రం అసలు విషయం రాసింది. పైగా అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. పూర్తి మెజారిటీతో ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి సాక్షి నిర్భయంగా రాసింది. ఈ విషయంలో సాక్షిని అభినందించవచ్చు.. నాడు బాలకృష్ణకు నిమ్స్ లో వైద్యం చేసిన బృందానికి కాకర్ల సుబ్బారావు నాయకత్వం వహించారు. నాటి ఘటనలో ఏం జరిగిందో తెలియదు కానీ బాలకృష్ణను కాపాడేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి.. ఇదే విషయాన్ని కాకర్ల సుబ్బారావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పేర్కొన్నారు. రాధాకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం గా సుబ్బారావు సంచలన విషయాలను వెల్లడించారు.
” నాడు బాలకృష్ణను కాపాడాలి. వేరే దారి లేదు. తప్పనిసరి పరిస్థితిలో మానసిక ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి వచ్చిందని” సుబ్బారావు పేర్కొన్నారు..” మీరు ఇంత సహాయం చేశారు కాబట్టి తర్వాత మీ సేవలను గుర్తించారా” అని వేమూరి రాధాకృష్ణ కాకర్ల సుబ్బారావు ను అడిగారు..” సహాయం అనే మాట పక్కన పెడితే.. దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఆ ప్రస్తావన ఇక్కడ అనవసరం.. తర్వాత చాలా జరిగిపోయాయని” సుబ్బారావు వ్యాఖ్యానించడంతో వేమూరి రాధాకృష్ణ ఆ టాపిక్ డైవర్ట్ చేశారు.
Also Read: ’హరిహర వీరమల్లు’ పై ఎందుకింత నెగెటివిటీ?
ఎప్పుడైతే కాకర్ల సుబ్బారావును ఈ ప్రశ్న వేమూరి రాధాకృష్ణ అడిగారో.. అప్పటినుంచి బాలకృష్ణ క్యాంపుకు, ఆంధ్రజ్యోతికి మధ్య విభేదాలు మొదలయ్యాయని అంటుంటారు. రాధాకృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యవహరించారు. దీంతో అటు బాలకృష్ణ, ఇటు వేమూరి రాధాకృష్ణ మధ్య ఉప్పూ నిప్పూ వ్యవహారం కొనసాగింది. ఫలితంగా చాలా రోజుల వరకు బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించలేదు. తర్వాత ఎవరు మధ్యవర్తిత్వం వ్యవహరించారో తెలియదు కానీ చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఫలితంగా బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి. బాలకృష్ణ విషయాలు ఏబీఎన్ లో వినిపిస్తున్నాయి.