Hari Hara Veera Mallu Pawan Kalyan : ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లు వెచ్చించాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రాంచరణ్ ఓ నాలుగేళ్లు ఎదురుచూశారు. వాళ్లు తమ విలువైన సమయాన్ని, వేరే సినిమాలు ఒప్పుకోకుండా కష్టపడితే అలాంటి కళాఖండాలు బయటకొచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా హీరో నుంచి రాజకీయాల్లోకి వెళ్లాక పూర్తిగా సినిమాలపై దృష్టిని పక్కనపెట్టారు. ప్రజాసేవ, ఏపీకి డిప్యూటీ సీఎంగా.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు..
సినిమాలపై ప్రచారం చేయడం.. కనీసం ప్రెస్ మీట్ కు కూడా హాజరు కావడం తనకు ఇబ్బంది అని ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు. రాజకీయంగా మీడియాతో మాట్లాడడం ఈజీ అని.. సినిమాల గురించి మాత్రం తాను ఆలోచించలేదని.. సినిమాలపై తనకు మోహమాటం అని.. సినిమాను ప్రమోట్ చేసుకోవడం తనకు తెలియదని.. ఎబ్బెట్టుగా ఉందని పవన్ తెలిపారు. జీవితంలోనే మొట్టమొదటిసారి సినిమా ప్రమోట్ చేస్తున్నట్టు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని, ఏదో మొక్కుబడిగా సినిమాలు చేస్తున్నారని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన సినిమాలు క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నాయని, క్వాంటిటీ కూడా తక్కువగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి.
ఈ నెగెటివిటీ ఇప్పుడు టికెట్ ధరల పెంపు వరకు వచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు పెంచడం సహజం. అయితే ‘హరిహర వీరమల్లు’ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచితే సినిమాకు నష్టం జరుగుతుందని, ప్రేక్షకులు సినిమా చూడటానికి ముందుకు రారని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇది టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా ఎగ్జిబిటర్లు ప్రభుత్వ నిర్ణయించిన (G.O) టికెట్ ధరలను తిరస్కరించడం గమనార్హం.
హరిహరవీరమల్లు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ప్రభుత్వ అనుమతించిన గరిష్ట టికెట్ ధరలతో వెళ్లడం లేదు. ప్రాంతం, స్థానిక డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలను సహేతుకమైన స్థాయిలో నిర్ణయిస్తున్నారు. ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. దీని ద్వారా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు భారం తగ్గుతుంది. అయితే, ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్ గత సినిమాలపై ఉన్న అంచనాలు, ప్రస్తుత రాజకీయ ప్రస్థానం వల్ల వచ్చిన మార్పులను స్పష్టం చేస్తుంది.
First time in the history of telugu cinema exhibitors rejecting G.O rates https://t.co/Po2vlpm98J pic.twitter.com/5tr8OHXHig
— IconbhAAi ️ (@iconbhaai) July 20, 2025
పవన్ కళ్యాణ్ సినిమాలు ఆదరణ కోల్పోతున్నాయా, లేక ఇది తాత్కాలికమేనా అన్నది సినిమా విడుదలయ్యాక స్పష్టమవుతుంది. అయితే పవన్ సైతం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రియేటివిటీ యుగంలో కేవలం జనసేన పార్టీకి డబ్బుల కోసమో.. మోహమాటానికో సినిమా చేస్తే అవి ఆడవు.. మార్కెట్లో బజ్ రావు. ఒక తపస్సులో సినిమా చేస్తేనే విజయం దక్కుతుంది. రాజకీయాలు ఆసక్తి అయితే వాటికే పవన్ వెళ్లాలి. సినిమాలు ఆపేయాలి. ఆయన కొడుకును రంగంలోకి దించాలి. ఇతర ఆదాయ మార్గాలు చూడాలి. లేదంటే ఇలా అరకొరగా సినిమాలు తీస్తే మునిగేది నిర్మాతనే. ఈ విషయంలో పవన్ ఆలోచించాలి. అందుకే వీటన్నింటివల్ల ‘హరిహర వీరమల్లు’ చిత్రంపై నెగెటివిటీ వ్యాపిస్తోంది. ఈ నెగెటివిటీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జీవితంలో మొట్టమొదటి సారి నా సినిమా ప్రమోట్ చేస్తున్నాను
– పవన్ కళ్యాణ్ #pawankalyan #HariHaraVeeramallu #Nidhiagarwal #HariHaraVeeraMalluTrailer pic.twitter.com/0dxPLmUHMm— Volganews (@Volganews_) July 21, 2025