Mahesh Babu Sitara birthday: సితారకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు మహేష్ బాబు. ఈ క్రమంలో సితారకు సంబంధించిన ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. మహేష్ బాబు బయటపెట్టిన ఆ రహస్యం ఏమిటో చూద్దాం..
స్టార్ హీరోల పిల్లలు సైతం సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారు. అబ్బాయిలను అయితే టీనేజ్ వయసు నుంచే వారిని అభిమానిస్తారు. నటవారసుడిగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారు. కూతుళ్ళకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉండదు. అయితే మహేష్ బాబు(MAHESH BABU) కూతురు సితార మాత్రం ప్రత్యేకం. సితార చాలా కాలం నుండి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తుంది. చిచ్చర పిడుగైన సితార… సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. పదేళ్లు కూడా నిండకుండానే సితార(SITARA) ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానల్ లో మట్టి వినాయకుడు వంటి సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేసేది.
Also Read: అల్లు అర్జున్ తో నటించిన హీరోయిన్స్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి..అయ్యో పాపం!
సితార ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా మైంటైన్ చేస్తుంది. ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్, ట్రావెల్ ఫోటోలు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ… అభిమానులకు టచ్ లో ఉంటుంది. అలియా భట్ తో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ తో సితారకు పరిచయాలు ఉన్నాయి. ఆమెకున్న ఫాలోయింగ్ రీత్యా ప్రముఖ నగల బ్రాండ్.. ప్రచారకర్తగా ఎంచుకుంది. సదరు జ్యువెలరీ సంస్థ సితారకు రూ. 1 కోటి రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సొమ్మును సితార ఛారిటీకి ఖర్చు చేసినట్లు సమాచారం. ఆ మధ్య ఓ అనాథశరణాలయంలో ఉంటున్న స్టూడెంట్స్ కి సితార సైకిల్స్ దానం చేసింది. వారితో కాసేపు గడిపి ముచ్చటించింది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే సితార తెలుగులో కొంచెం వీక్. జులై 20న సితార జన్మదినం నేపథ్యంలో మహేష్ బాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం నువ్వు టీనేజర్. హ్యాపీ బర్త్ డే. నా జీవితంలో ఎప్పుడూ వెలుగులు నింపుతూ ఉండు. లవ్ యూ సో మచ్ అని ఇంస్టాగ్రామ్ లో మహేష్ కామెంట్ చేశారు. సితారతో కూడిన ఫోటో పంచుకున్నారు.
Also Read: ఓటీటీ లో ‘కుబేర’ కి సెన్సేషనల్ రెస్పాన్స్..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
సితార టీనేజర్ అని చెప్పడం ద్వారా ఆమె వయసు 13 ఏళ్ళన్న విషయం మహేష్ చెప్పకనే చెప్పాడు. 13-19 ఏజ్ లో ఉన్న పిల్లలను టీనేజర్స్ గా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ తన ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏడాది రెండు మూడు విదేశీ ట్రిప్ ఫ్యామిలీతో ప్లాన్ చేస్తాడు. ప్రస్తుతం మహేష్ బాబు SSMB 29 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు వెయ్యికోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.