Chiranjeevi – Balayya Multi-starrer Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు తరం ముగిసిన తర్వాత చిరంజీవి, బాలయ్య బాబుల శకం మొదలైంది.. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు విపరీతమైన పోటీని పెట్టుకుని మరి సినిమాలను సక్సెస్ ఫుల్ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకరిని మించిన సినిమాలు మరొకరు చేయడమే కాకుండా ఇద్దరు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు… ఇక ఎప్పటికప్పుడు చిరంజీవి తన పంథా లో సినిమాలను చేస్తూ గొప్ప విజయాలను అందుకుంటూ బాలయ్య బాబు కంటే ఒక మెట్టు పైనే ఉంటూ వస్తున్నాడు. అందుకే తను మెగాస్టార్ గా మారాడు. బాలయ్య బాబు సైతం మెగాస్టార్ కంటే తక్కువేమి కాదు. తన సినిమాలతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ఒకానొక టైం లో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు సీనియర్ హీరోలు అయిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని ప్రేక్షకులైతే కోరుకుంటున్నారు.
ప్రస్తుతానికైతే చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. మరి బాలయ్య బాబుతో స్క్రీన్ షేరింగ్ ఎప్పుడు ఉంటుంది అనేదానిమీద ప్రతి ఒక్కరి చూపైతే ఉంది. బాలయ్య తో నటించడానికి చిరంజీవి సైతం సిద్ధంగా ఉన్నాడు. మా కాంబోను కలిపే కథ కోసం మేము ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ గతంలో వీళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చారు.
వీళ్ళిద్దరిని కలిపి సినిమాను తీయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు ఎవరు అని ధోరణిలో ఇప్పుడు సర్వత్ర ఆసక్తైతే నెలకొంది… ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడిని సైతం కొంతమంది ఇదే క్వశ్చన్ ని అడిగారు. అటు బాలయ్య బాబుతో సినిమా చేశారు. ఇటు చిరంజీవి తో సినిమా చేసి సక్సెస్ ని అందించబోతున్నారు. కాబట్టి అటు బాలయ్యకి ఇటు చిరంజీవికి మధ్యలో మీరు ఉన్నారు.
వాళ్ళిద్దరిని కలిపే బాధ్యతను కూడా మీరే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడంతో అనిల్ రావిపూడి సైతం దానికి తగ్గ కథ దొరికితే పక్కాగా చేస్తాను. వాళ్ళిద్దర్నీ కలిపి చూడాలని నాకు కూడా ఉంది అంటూ ఆయన సమాధానం ఇచ్చాడు. ఇక దాంతో చాలామంది సినిమా ప్రేక్షకులు అలాగే చిరంజీవి, బాలయ్య బాబు అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…