Balakrishna: నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించాలని చూసిన ఆయనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా డిజాస్టర్ గా మారడమే కాకుండా దాదాపు 50 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాకి భారీ బడ్జెట్ ఉండకూడదనే ఉద్దేశ్యంతో బాలయ్య స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీని తెరకెక్కించాలని చూసిన ఆయన మొత్తానికైతే ఆ స్క్రిప్ట్ ను పక్కన పెట్టేసి కమర్షియల్ సినిమాకి ఓటు వేశాడు. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కమర్షియల్ సినిమాగా రాబోతుంది…
మొత్తానికైతే బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ అద్భుతంగా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో సైతం ఆయన డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు బాలయ్య చేసిన చాలా సినిమాల్లో డ్యూయల్ రోల్ లోనే నటించాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో భగవంత్ కేసరి సినిమాను మినహాయిస్తే శ్రీ మిగిలిన అన్ని సినిమాల్లో ఆయన డ్యూయల్ రోల్ లోనే నటించాడు…
ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ మలినేని మార్కు చూపిస్తూ బాలయ్య బాబు ను సింహంలా చూపిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమాలు సక్సెస్ అయితే ఇబ్బంది ఉండదు.
కాకపోతే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోతారు…ఇక అఖండ 2 విషయంలో జరిగిన తప్పు మరోసారి జరగకూడదని బాలయ్య తక్కువ బడ్జెట్ తో సినిమాలను చేయడమే మంచిదని డైరెక్టర్లకు ప్రొడ్యూసర్స్ కి చెబుతున్నాడట…ఇక బాలయ్య మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన సమయమైతే ఆసన్నమైంది…