Balakrishna On Chiranjeevi
Balakrishna On Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకుల్లో వారిద్దరికీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటంతో పాటు విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు ఇద్దరు బడా హీరోలు ఎన్నో సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు సైతం అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు.
చిరు నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహా రెడ్డి సినిమాలు గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. అంతేకాదు అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదంతా పక్కన పెడితే దర్శకులను ఎంపిక చేసుకోవడంలో బాలయ్య.. చిరంజీవిని ఫాలో అవుతున్నారట. ఇందుకు సంబంధించి నెట్టింట్లో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా రాగా.. ప్రస్తుతం బాలయ్య, బాబీ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. మరోవైపు చిరు ప్రస్తుతం మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే నందమూరి హీరో బాలకృష్ణ కూడా డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాబీ, మల్లిడి వశిష్ట లతో సినిమాలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవిని బాలయ్య ఫాలో అవుతున్నారంటూ పలు కామెంట్లు వస్తున్నాయి. టాలీవుడ్ లోకి యువ హీరోలు వస్తున్నప్పటికీ చిరంజీవి, బాలయ్యకు ఉన్న క్రేజ్ మాత్రం రోజురోజుకు మరింతగా పెరిగిపోతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
అంతేకాదు మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న ప్రేక్షకులు చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ లో మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరిక మేరకు వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి..