Chandrababu: చంద్రబాబు నమ్మకం అదే

జనసేనతో పొత్తు పెట్టుకోవడం కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బలమైన కాపు సామాజిక వర్గం కూటమి వైపు వస్తుందని అంచనాతో ఉన్నారు. జనసేనతో జతకట్టడం ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో స్వీప్ చేస్తామని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : January 17, 2024 2:01 pm

Chandrababu

Follow us on

Chandrababu: తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు కీలకం.ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య.ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టిడిపి గెలుపొందాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాక తప్పదు.అందుకే చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పొత్తుల నుంచి పార్టీలో చేరికల వరకు వ్యూహాత్మక పద్ధతిని అనుసరిస్తున్నారు. గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.

జనసేనతో పొత్తు పెట్టుకోవడం కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బలమైన కాపు సామాజిక వర్గం కూటమి వైపు వస్తుందని అంచనాతో ఉన్నారు. జనసేనతో జతకట్టడం ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో స్వీప్ చేస్తామని భావిస్తున్నారు.ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారు. పవన్ ద్వారా కాపులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. చివరకు ముద్రగడ పద్మనాభం లాంటి నేతలను వైసీపీ వైపు వెళ్లకుండా.. జనసేనలో చేరే విధంగా పావులు కదిపారు. దీని వెనుక పవన్ తో పాటు చంద్రబాబు వ్యూహం కూడా దాగి ఉందని తెలుస్తోంది. అటు పవన్ సైతం గోదావరి జిల్లాల్లో వైట్ వాష్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. పదేపదే పార్టీ శ్రేణులకు హితబోధ చేయడం వెనుక అసలు రహస్యం అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవైపు గోదావరి జిల్లాలో శత శాతం సీట్లు సాధించడంతో పాటు కోస్తాంధ్రలో 70 శాతం సీట్లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమరావతి రాజధాని పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు కూటమికి విజయం తెచ్చి పెడతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అటు ఉత్తరాంధ్రలో సైతం మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని ఒక అంచనాకు వచ్చారు.

అయితే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమలో వైసీపీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది.అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల కంటే సీట్లు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 55 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఈసారి 20 పైగా స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మిగతా ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా కూటమి ఘనవిజయం సాధిస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. పైగా బిజెపి, వామపక్షాలు తగ్గుతున్నందున, జగన్ కు వ్యతిరేకంగా ఉన్నందు వల్ల తప్పనిసరిగా తమ ఓటు శాతం పెరుగుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. మరి ఓటర్ల మనసులో ఏముందో చూడాలి.