Eagle: సంక్రాంతి బరి నుంచి ఈగల్ మూవీ తప్పుకొని మంచి పని చేసిందా..?

సంక్రాంతి కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల అన్ని సినిమాలకి థియేటర్లు సరిగ్గా దొరకకపోవడం ఒక కారణం అయితే, అంత భారీ పోటీలో రిలీజ్ చేసి సినిమాకి కలెక్షన్స్ ని తగ్గించుకోవడం ఎందుకు అనే మరొక రీజన్ తో ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

Written By: Gopi, Updated On : January 17, 2024 12:40 pm

Eagle

Follow us on

Eagle: రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమా ఈగల్…ఈ సినిమా మొదట సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సంక్రాంతి పోటీ నుంచి ఈ సినిమా తప్పుకున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి పోటీకి బరిలో దిగుతుంది అని ప్రకటించిన కూడా చివరి నిమిషం లో సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం పట్ల చాలా వార్తలు వచ్చాయి.

అయితే సంక్రాంతి కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల అన్ని సినిమాలకి థియేటర్లు సరిగ్గా దొరకకపోవడం ఒక కారణం అయితే, అంత భారీ పోటీలో రిలీజ్ చేసి సినిమాకి కలెక్షన్స్ ని తగ్గించుకోవడం ఎందుకు అనే మరొక రీజన్ తో ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

ఇక ఆ రోజు అయితే సోలో రిలీజ్ చేసుకోవచ్చనే ఆలోచనతో మేకర్స్ ఈ పని చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో హనుమాన్ సినిమా ఒక్కటే భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ క్రమంలో రవితేజ ఈగల్ సినిమా కనక సంక్రాంతి కి వచ్చి డివైడ్ టాక్ ను తెచ్చుకున్నట్టైతే హనుమాన్ సినిమా దూకుడు ముందు ఈగల్ సినిమా చాలావరకు డీలా పడిపోయేది.

ఎందుకంటే హనుమాన్ సినిమా రోజు రోజుకీ షోలను ఇంక్రీజ్ చేసుకుంటూ చాలా థియేటర్ లని పెంచుకుంటూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తుందనే చెప్పాలి. ఇక ఇలాంటి సిచువేషన్ లో ఈగల్ సినిమా వచ్చిన కూడా ఆ సినిమా ఏమాత్రం నిలబడేది కాదు. దాంతో ఆ సినిమాకి కలెక్షన్లు కూడా చాలా వరకు తగ్గేవి.

కాబట్టి రవితేజ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయకపోవడమే మంచిదైంది అంటు చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ బాట పడుతాడేమో చూడాలి. ఇక ఈ సినిమా సక్సెస్ సాదించడం రవితేజ కంటే కూడా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి చాలా కీలకంగా మారనుంది…