https://oktelugu.com/

Akhanda Movie: అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారంటే…

Akhanda Movie: మాస్ డైరెక్టర్ బోయపాటి నటసింహ బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ” అఖండ”. ఈ డిసెంబర్ 2 న విడుదలై బాక్సాఫీసు వద్ద కలక్షన్ కింగ్ గా మారారు బాలయ్య. గత రెండేళ్లుగా కరోనా ధాటికి అంతంత మాత్రమే బాక్స్ కలెక్షన్స్ వసూళ్ళు చేస్తే అఖండ సినిమాతో భారీ కలెక్షన్స్ ను పుంజుకున్నారు బాలయ్య. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇండియాలో అఖండమైన విజయం అందుకోగా అమెరికాలో కూడా పలు రాష్ట్రాలలో “అఖండ” […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 5, 2021 / 08:13 PM IST
    Follow us on

    Akhanda Movie: మాస్ డైరెక్టర్ బోయపాటి నటసింహ బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ” అఖండ”. ఈ డిసెంబర్ 2 న విడుదలై బాక్సాఫీసు వద్ద కలక్షన్ కింగ్ గా మారారు బాలయ్య. గత రెండేళ్లుగా కరోనా ధాటికి అంతంత మాత్రమే బాక్స్ కలెక్షన్స్ వసూళ్ళు చేస్తే అఖండ సినిమాతో భారీ కలెక్షన్స్ ను పుంజుకున్నారు బాలయ్య. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇండియాలో అఖండమైన విజయం అందుకోగా అమెరికాలో కూడా పలు రాష్ట్రాలలో “అఖండ” సందడి వాతావరణం కనిపిస్తుంది.

    Akhanda

    అమెరికాలో చికాగో నగరంలో బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడి థియేటర్లు సందడిగా కనిపించాయి. జై బాలయ్య అంటూ బాలయ్య ఫ్యాన్స్‌ ఉర్రూతలూగిపోయారు. ఇక అఖండ చిత్రం రిలీజ్‌ సందర్భంగా షికాగో నగరంలోని థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు కేక్‌ కట్‌ చేసి జై బాలయ్యా అంటూ నినాదాలతో సందడి చేశారు. అమెరికాలో మరో ప్రాంతమైన డల్లాస్ నగరంలోనూ ఇదే వాతావరణం చోటు చేసుకుంది.డల్లాస్ నగరంలో అభిమానులు భారీ ఎత్తున కార్‌ ర్యాలీ తీసి, థియేటర్ల దగ్గర సంబరాలు అంబరాలు అందుకున్నాయి .విశేషం ఏమిటంటే ఏకంగా 116 కార్లు ఊరేగింపుగా థియేటర్లకు బయలు దేరాయి.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ అక్కడి వీధులు, థియేటర్లు వీరి కేరింతలతో మార్మోగిపోయాయి.

    Also Read: Samantha: జీవితంలో అదే అతి పెద్ద గుణపాఠం అంటున్న సమంత…

    డల్లాస్‌ సినిమాక్స్‌ థియేటర్‌లో అభిమానులంతా కేక్‌ కట్‌ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ విడుదలైన సింహా, లెజెండ్ సినిమాలు విజయం ఇటువంటి విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ హ్యాట్రిక్ విజయంతో అభిమానులు సందడి అలా ఇలా లేదు.

    Also Read: Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్