Pushpa Allu Arjun: పుష్ఫ.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. డిసెంబర్ 27న విడుదలకానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ లు అంచనాలను పెంచేశాయి. తాజాగా పుష్ప టీం ఒక మేకింగ్ వీడియోను పంచుకుంది. ఓ అడవిలో చిత్రీకరించిన దృశ్యాలను ఇందులో చూడొచ్చు.
అడవిలో చిత్రీకరణ సందర్భంగా షూటింగ్ ప్రారంభానికి ముందు అల్లు అర్జున తన చిత్రం యూనిట్ కు సంచలన ఆదేశాలు ఇచ్చారు. దీన్ని వీడియో తీసి విడుదల చేయడంతో వైరల్ అయ్యాయి.
Also Read: Akhanda Movie: అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారంటే…
ఇది అడవి.. ప్రకృతి ప్రసాదం.. ఎవరు వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులను వారే దయచేసి డస్ట్ బిన్ లో వేయండి.. మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం అని అల్లు అర్జున్ ఆ వీడియోలో సూచించారు. దీన్ని బట్టి అడవిలో షూటింగ్ చేసి ఆ అడవి మానవ వ్యర్థాలతో నాశనం చేయవద్దని అల్లు అర్జున్ ఇచ్చిన పిలుపు వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ మంచి మనసుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: Samantha: జీవితంలో అదే అతి పెద్ద గుణపాఠం అంటున్న సమంత…
వీడియో