Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య తో ప్రయోగాత్మకమైన సినిమాకి సిద్ధమైన కుర్ర దర్శకుడు...

Balakrishna: బాలయ్య తో ప్రయోగాత్మకమైన సినిమాకి సిద్ధమైన కుర్ర దర్శకుడు…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేస్తున్న సినిమాలన్నీ అతనికి స్టార్ డమ్ ను తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇంతకుముందు వరుసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు డీలాపడ్డాడు. అయినప్పటికి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెలుస్తుంది. మరి బాలయ్యను ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా చూపించడం అనేది ఒకరకంగా సాహసం అనే చెప్పాలి. కానీ దానిని గ్రిప్టింగ్ గా మలిస్తే మాత్రం బాలయ్య ఆ క్యారెక్టర్ లో అదరగొట్టడమే కాకుండా ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేయగలుగుతాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి బాలయ్య బాబుకు డిఫరెంట్ అటెంప్ట్ లు చేసే సమయం అయితే ఆసన్నమైంది. ఇంతకు ముందు వరకు మూస ధోరణిలోనే సినిమాలను చేస్తు సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

దానివల్ల అతనిలోని పూర్తి స్థాయి నటుడు బయటికి రావడమే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించగలడనే ఒక సంతృప్తి కూడా తన పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తను వైవిద్య భరితమైన పాత్రల కోసం ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండి పోయే వాళ్ల లో నందమూరి ఫ్యామిలీ ఒకటి…

ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. కాబట్టి బాలయ్య బాబు సైతం గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తేనే అతని క్రెడిబిలిటి అనేది ఎక్కువ రోజులు పాటు ఉండే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version