Mokshagna Movie Entry: నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని రోజులుగా చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన ఇప్పటివరకు సినిమా చేసింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లేదు. ఎందుకని ఆయన సినిమా చేయడం లేదు అంటు నందమూరి అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ తో సినిమా స్టార్ట్ చేసినప్పటికి ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్ట్ మీద పూర్తి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ మూవీ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఏ దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఆలోచిస్తున్నారట. అయితే మోక్షజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావడం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్తున్నాడట.
మొత్తానికైతే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తే బాలయ్య బాబు నట వారసత్వం ముందుకు సాగుతుంది. అలాగే తను కూడా టాప్ హీరోగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ తనకు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఏది ఏమైనా కూడా బాలయ్య నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు సాగుతాడు అనుకున్న మోక్షజ్ఞ ఇలా మధ్యలో నిలబడి పోవడం అనేది నిజంగా ఒక రకంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
ఇక నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంట్రెస్ట్ చూపించినప్పటికి వాళ్ళు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు. మోక్షజ్ఞ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటాడు. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రాబడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దూరంలో కూడా అభిప్రాయాలు వెలువడుతున్నాయి… మొత్తానికైతే మోక్షజ్ఞ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తేనే అతనికి ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగాల్సి ఉంటుంది. అవన్నీ క్యాలిక్లెట్ చేసుకొని రంగంలోకి దిగితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…
