Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కని విని ఎరుగని రీతిలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల… ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ క్లాస్ సినిమాలే కావడంతో అతనికి స్టార్ డైరెక్టర్ పేరు వచ్చినప్పటికి స్టార్ హీరోలేవ్వరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన హ్యాపీడేస్ మూవీ కి సీక్వెల్ గా హ్యాపీడేస్ 2 సినిమా చేస్తున్నాడు. దానికోసమే ఆడిషన్స్ నిర్వహించి ఇంకా కొంతమంది కొత్త కుర్రాళ్లను ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తానని అతను గతంలోనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
ఇక ఇప్పుడున్న పరిస్థితిలో తను బాలయ్య బాబుతో సినిమా చేయాల్సి వస్తే ఒక క్లాస్ క్యారెక్టర్ లో బాలయ్య బాబుని చూపిస్తానని సినిమా మొత్తం ఒక ఫైట్ కూడా లేకుండా చిత్రీకరిస్తానని చెబుతున్నాడు. ఇకదంతా విన్న బాలయ్య అభిమానులు మాత్రం భారీ డైలాగులు లేకుండా, ఫైటింగ్ సీన్స్ లేకుండా బాలయ్య సినిమాను ఎవరు చూస్తారు.
అలా ఉంటే బాలయ్య మాకు నచ్చడు అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల తన స్టైల్ మార్చుకోలేడు. కాబట్టి తనకు ఎలాంటి స్టార్ హీరో దొరికిన కూడా వాళ్ళని చాలా క్లాస్ గా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకునేలా వాళ్ళని తీర్చిదిద్దుతాననే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
ఇక బాలయ్య శేఖర్ కమ్ములకు అవకాశం ఇచ్చి మరో ప్రయోగాత్మకమైన సినిమాని చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు…ఈ మూవీ తో పాన్ ఇండియాలోకి అడుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…