spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: పబ్లిక్ లో బాలయ్య చేసిన పనికి అందరూ షాక్... మేటర్ ఏంటంటే?

Balakrishna: పబ్లిక్ లో బాలయ్య చేసిన పనికి అందరూ షాక్… మేటర్ ఏంటంటే?

Balakrishna: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు రాజకీయంగా కూడా బిజీగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణకు గోల్డెన్ టైం నడుస్తుంది. 2021 కి ముందు వరకు బాలకృష్ణ కెరీర్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో బాలయ్య మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. స్టార్ హీరో హోదాలో ఉండిరూ. 10 కోట్ల వసూళ్లు రాబట్టలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇక బాలకృష్ణ కెరీర్ ముగిసిందనుకుంటున్న తరుణంలో అఖండ రూపంలో ఆయనకు భారీ హిట్ పడింది.

దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన అఖండ గొప్ప విజయం అందుకుంది. వీర సింహారెడ్డి చిత్రంతో మరొక హిట్ ఖాతాలో వేసుకున్నాడు. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి వంద కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇక బాలకృష్ణ గత చిత్రం భగవంత్ కేసరి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ మూవీలో శ్రీలీల కీలక రోల్ చేసింది.

ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రం చేస్తున్నారు. దర్శకుడు బాబీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలకృష్ణ లుక్ సైతం ఆకట్టుకుంది. NBK 109 వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు. NBK 109 కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు కొడుకు మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మోక్షజ్ఞ మేకోవర్ సాధించి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యాడు. బాలకృష్ణ కథ కూడా లాక్ చేశాడట. ఓ స్టార్ డైరెక్టర్ తో గ్రాండ్ లాంచ్ చేయనున్నాడట. మోక్షజ్ఞ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కల త్వరలో నెరవేరనుంది. వీటన్నింటికీ మించి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచాడు. కూటమి ప్రభుత్వం గెలిచి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

బాలకృష్ణ బావగారు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు. ఈ క్రమంలో ఆయన హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన వాటర్ ప్లాంట్ ని ప్రారంభించినట్లు సమాచారం. అనంతరం బాలకృష్ణ ఆర్టీసీ బస్ నడిపారు. న హిందూ పురంలో కొత్త బస్సులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు నడిపారు.

బాలయ్య స్వయంగా బస్సు నడిపి డ్రైవర్ అవతారం ఎత్తాడు. బాలకృష్ణ బస్సు నడపడంతో కార్యకర్తలు నినాదాలు చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. బాలకృష్ణ పబ్లిక్ లో బస్సు డ్రైవ్ చేసి రియల్ హీరో అనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కాగా బాలకృష్ణ తదుపరి చిత్రం బోయపాటి శ్రీనుతో చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివర్లో బాలకృష్ణ-బోయపాటి మూవీ పట్టాలెక్కే సూచనలు కలవు. వీరి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇది.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version