https://oktelugu.com/

Samantha: విడాకుల తర్వాత నాగ చైతన్య నుండి సమంత ఇన్ని కోట్లు భరణం తీసుకుందా..? ఆ డబ్బులతో రాజమౌళి ఒక సినిమా తీసేయొచ్చు!

నాగ చైతన్య రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత తో నిశ్చితార్థం చేసుకోవడంతో మరోసారి సమంత - నాగ చైతన్య కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 17, 2024 / 12:02 PM IST

    Samantha

    Follow us on

    Samantha: టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి నాగ చైతన్య – సమంత జంట. వీళ్లిద్దరి పెళ్లి అప్పట్లో ఒక సెన్సేషన్, అలాగే వీళ్ళు విడిపోవడం కూడా ఒక సెన్సేషన్. పెళ్ళైన కొత్తలో ఈ జంటని చూసిన ప్రతీ ఒక్కరు, భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి అని అనుకునేవారు. పెళ్ళైన మూడేళ్ళ వరకు అలాగే ఉండేది. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు, అపోహలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. 2021 వ సంవత్సరం లో వీళ్లిద్దరు విడిపోగా, ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు.

    ఇకపోతే నాగ చైతన్య రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత తో నిశ్చితార్థం చేసుకోవడంతో మరోసారి సమంత – నాగ చైతన్య కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. సమంత విడిపోయే ముందు నాగ చైతన్య మరియు అక్కినేని ఫ్యామిలీ నుండి 200 కోట్ల రూపాయిల భరణం తీసుకుంది అంటూ మీడియా లో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. దీనిపై రీసెంట్ గానే సమంత ఒక పాపులర్ బాలీవుడ్ టాక్ షో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘అవును..నిజమే..నా మాజీ భర్తతో విడిపోవడానికి నేను ఆయన నుండి 250 కోట్ల రూపాయిలు అప్పు తీసుకున్నాను. అందుకే ప్రతీ ఉదయం నేను ఇన్కమ్ టాక్స్ అధికారుల కోసం మా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. కనీసం వాళ్లకి అయినా నేను నిజానిజాలను చూపించగలను’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది సమంత. వాస్తవానికి సమంత నాగ చైతన్య కంటే పెద్ద స్టార్. కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరూ ప్రస్తుతం మార్కెట్ పరంగా సమంత కంటే తక్కువే. ఆమె సినిమాలకు ఓవర్సీస్ లో ఎంత ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా అక్కినేని హీరోల కంటే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి.

    అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న సమంత కి నాగ చైతన్య వద్ద భరణం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి?, కావాలంటే సమంతానే నాగ చైతన్య కి ఇస్తుంది అంటూ సోషల్ మీడియా లో సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ, విశ్రాంతి తీసుకుంటున్న సమంత, త్వరలోనే మళ్ళీ షూటింగ్స్ లో బిజీ కానుంది. ఏడాది క్రితం ఆమె ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేసారు. ఈ టీజర్ లో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.