https://oktelugu.com/

Prithvi shaw : జట్టు లో అవకాశాల్లేవ్.. గత్యంతరం లేక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న క్రికెటర్..

టీమిండియాలో యుజువేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో స్పిన్ వేస్తూ.. విభిన్నమైన బౌలర్ గా పేరుపొందాడు. ఇటీవలి ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చూపాడు. హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 9:12 pm
    Prudvi Shaw

    Prudvi Shaw

    Follow us on

    Prithvishaw:  సోషల్ మీడియాలో యజువేంద్ర చాహల్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. క్రికెట్ మైదానంలో జరిగిన సంఘటనలకు తనదైన హాస్య చతురతను జోడిస్తాడు. అప్పటికప్పుడు వీడియో లేదా మీమ్స్ రూపొందిస్తాడు. అందువల్లే అతడిని అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా అనుసరిస్తారు.. పైగా చాహల్ సోషల్ మీడియాలో సరదాగా కనిపిస్తుంటాడు. అందువల్లే అతడు ఏ పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటాయి. కొన్నిసార్లు అవి మిలియన్స్ ను రిచ్ అవుతాయి. ఇన్ స్టా గ్రామ్ లో యజువేంద్ర చాహల్ ను 9.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాహల్ తన ఇన్ స్టా ఖాతాలో ఒక కథనాన్ని షేర్ చేశాడు. దాన్ని చూసిన నెటిజన్లు నవ్వడం మొదలుపెట్టారు.

    పృథ్వీ షా కు స్టార్ ఓపెనర్ గా పేరుంది. అయితే అతడు 2021 జూలై నుంచి టీ మీడియాకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం పృథ్వి, యజువేంద్ర ఇంగ్లాండ్ దేశంలో కౌంటి క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో యజువేంద్ర తన ఇన్ స్టా లో ఒక స్టోరీని ప్రత్యేకమైన ఫోటోలతో షేర్ చేశాడు. ఇందులో పృథ్వి ఒక పెట్రోల్ బంకులో కనిపించాడు. అయితే అతడు కారు యజమానిగా కాకుండా.. కారులో ఇంధనం నింపుతున్న వ్యక్తిగా కనిపించాడు.. దీంతో ఆ కథనాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. “టీమిండియా కు మూడు సంవత్సరాల నుంచి దూరమయ్యాడు. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు.. ఇంతకు మించిన దారుణం ఇంకేముంటుందని” వ్యాఖ్యానిస్తున్నారు.. పృథ్వి ప్రస్తుత కౌంటింగ్ క్రికెట్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. టీమిండియాలో పునరాగమనం చేసేందుకు తాపత్రయ పడుతున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో పృథ్వి అద్భుతంగా ఆడాడు. దీంతో అతడిని దిగ్గజ ఆటగాళ్లతో అందరూ పోల్చారు. ఆ తర్వాత తన ఫామ్ కోల్పోయాడు. ఫలితంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక పృథ్వి 2013లో ముంబై జట్టుతో జరిగిన ఒక క్లబ్ మ్యాచ్ లో 500 కు పైగా స్కోర్ చేసి.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. నాయకత్వంలో టీమిండియా అండర్ -19 ప్రపంచకప్ సాధించింది. ఆ తర్వాత అతడికి టీమ్ ఇండియాలో స్థానం లభించింది. అయితే అతడు ఆస్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. పైగా కొన్ని వివాదాలు అతనిని తీవ్రంగా చుట్టుముట్టాయి. దీంతో ఈ యువ సంచలనం జట్టుకు దూరంగా ఉండిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండు దేశం లో కౌంటి క్రికెట్ ఉత్సాహంగా ఆడుతున్నాడు.