https://oktelugu.com/

Narendra Modi : శాఖల కేటాయింపులో మోదీ మార్క్‌.. సాయంత్రం తొలి కేబినెట్‌ భేటీ!

కేంద్రంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ.. తన కేబినెట్‌లోకి 72 మందిని తీసుకున్నారు. ఇందులో 30 మందిని మంత్రి వర్గంలోకి ఐదుగురిని స్వతంత్ర మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2024 / 11:14 AM IST

    Narendra-Modi-cabinet

    Follow us on

    Narendra Modi : కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మంత్రులు, స్వతంత్ర సహాయ మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇక వారికి కేటాయించే శాఖలపై కసరత్తు జరుగుతోంది. ఎవరికి ఏ శాఖ ఏటాయించాలనే విషయంలో మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సోమవారం(జూన్‌10) మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. శాఖల కేటాయింపు తర్వాత తొలి కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం.

    కీలక శాఖలు బీజేపీకే..

    కేంద్రంలో కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను బీజేపీ తన వద్దనే ఉంచుకునే అవకాశం ఉంది. బీజేపీ నేతలకే ఈ పదవులు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే మడోదఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మోదీ గతంలోనే ప్రకటించారు. దీని పరిధిలోకి వచ్చే శాఖలను కూడా బీజేపీ మంత్రలకే కేటాయించే అవకాశం ఉంది.

    మంత్రివర్గ కూర్పులో కుల సమీకరణ..
    ఇక మంత్రి వర్గ కూర్పులో కూడా మోదీ తన మార్కు చూపించారు. సామాజిక, కుల సమీకరణల ఆధారంగా మోదీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేసన్‌లో మోదీ మార్కుతో కేబినెట్‌ బెర్తులు కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది.

    కీలక శాఖలకు భాగస్వామ్య పక్షాల డిమాండ్‌..
    ఇదిలా ఉంటే ఎన్డీఏలోని కీలక భాగస్వాములు కూడా కీలక శాఖల కోసం పట్టుపడుతున్నారు. తమ ప్రయోజనాల కోసం అవసరమైన శాఖలను అడుగుతున్నాయి. జేడీఎస్‌ నేత కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాఖలను కోరామని టీడీపీ తెలిపింది. జేడీయూ, ఇతర పార్టీలు కూడా కీలక శాఖలు అడుగుతున్నాయి. ఇతర పార్టీలు సైతం తమకు ఏ శాఖలు కావాలో ఇప్పటికే మోదీ దృష్టికి తీసుకెళ్లాయి. ఇదిలా ఉండగా, జేపీ.నడ్డా నేతృత్వంలో శాఖల కేటాయింపుపై సంప్రదింపులు జరుగుతున్నాయి.

    72 మంది మంత్రులతో క్యాబినెట్‌
    ఇక కేంద్రంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ.. తన కేబినెట్‌లోకి 72 మందిని తీసుకున్నారు. ఇందులో 30 మందిని మంత్రి వర్గంలోకి ఐదుగురిని స్వతంత్ర మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు. మంత్రుల్లో 43 మంది మూడుసార్లకంటే ఎక్కువసార్లు గెలిచిన వారే. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు.