India vs Pakistan : వారెవ్వా బుమ్రా.. అవి బంతులా.. దూసుకొచ్చే బుల్లెట్లా? వీడియో వైరల్

India vs Pakistan ఈ మ్యాచ్లో ముందుగా బౌలింగ్ చేసిన పాకిస్తాన్ బౌలర్లు భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి వారిని వెంట వెంటనే అవుట్ చేసి చుక్కలు చూపించారు

Written By: NARESH, Updated On : June 10, 2024 10:46 am

India vs Pakistan

Follow us on

India vs Pakistan : అసలే అది న్యూయార్క్ మైదానం.. ఆదివారం మరింత మంద కొడిగా ఉంది. అవుట్ ఫీల్డ్ తేమతో ఉంది. ఇలాంటి మైదానంపై వికెట్ రాబట్టడం బౌలర్లకు తేలికైన పనే.. భారత ఇన్నింగ్స్ సమయంలో పాకిస్తాన్ బౌలర్లు ఇలానే చేశారు.. రిషబ్ పంత్, అక్షర్ పటేల్ మినహా మిగతా వారంతా పాకిస్తాన్ బౌలర్లకు దాసోహమయ్యారు.. ఫలితంగా భారత్ 119 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ దశలో ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ మెరుగ్గానే బ్యాటింగ్ చేసింది.. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. విజయం వైపు వేగంగా అడుగులు వేసింది.. కానీ ఈ దశలో మ్యాజిక్ చేశాడు భారత ఏస్ బౌలర్ బుమ్రా. ఐదో ఓవర్ లో బాబర్ ను ఔట్ చేసి పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ప్రమాదకరమైన ఆటగాడు రిజ్వాన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్ ను పెవిలియన్ పంపించాడు. ఆశలు కోల్పోయి.. ఓటమి అంచులో నిలిచిన టీమిండియాను.. తన బౌలింగ్ మాయతో కాపాడాడు..

ఈ మ్యాచ్లో ముందుగా బౌలింగ్ చేసిన పాకిస్తాన్ బౌలర్లు భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి వారిని వెంట వెంటనే అవుట్ చేసి చుక్కలు చూపించారు. కీలక ఆటగాళ్లు త్వరగా అవుట్ కావడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. 119 పరుగులకే కుప్పకూలడంతో… గెలుస్తుందా అనే అనుమానం మొదలైంది. ఇక అప్పటిదాకా బౌన్స్ కు సహకరించిన న్యూయార్క్ మైదానం.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయానికి ఒక్కసారిగా మారిపోయింది. పచ్చిక బ్యాటింగ్ కు అనుకూలించింది. అయితే ఈ దశలో బుమ్రా తన అద్భుతమైన బంతులతో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.. ప్రమాదకరమైన బాబర్ ను బలిగొన్న బుమ్రా.. రిజ్వాన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ను కూడా అవుట్ చేసి భారత జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్లు బౌల్ చేసి.. 14 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తీసిన మూడు వికెట్లు పాకిస్తాన్ జట్టులో అత్యంత కీలకమైనవే. వీరిలో బాబర్, రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ ఉన్నారు. బుమ్రా కు హార్థిక్ పాండ్యా కూడా తోడు కావడంతో పాకిస్తాన్ కీలక సమయంలో వికెట్లు కోల్పోయింది.. బుమ్రా వికెట్లు తీసిన విధానాన్ని ఐసీసీ తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.