https://oktelugu.com/

‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయి. మార్చిలో కేంద్రం లాక్డౌన్ విధించడంతో ప్రజారవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రమేణ కేంద్రం లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడు ప్రజారవాణా కోలుకుంటోంది. ప్రధాన నగరాల్లో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయి. రైళ్లు.. విమాన ప్రయాణాలకు మాత్రం కేంద్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా? లాక్డౌన్ కారణంగా విమానరంగం పూర్తిగా దెబ్బతింది. ఈ రంగంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 / 04:16 PM IST
    Follow us on


    దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయి. మార్చిలో కేంద్రం లాక్డౌన్ విధించడంతో ప్రజారవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రమేణ కేంద్రం లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడు ప్రజారవాణా కోలుకుంటోంది. ప్రధాన నగరాల్లో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయి. రైళ్లు.. విమాన ప్రయాణాలకు మాత్రం కేంద్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

    Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

    లాక్డౌన్ కారణంగా విమానరంగం పూర్తిగా దెబ్బతింది. ఈ రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు ఇప్పటికే రోడ్డుపై పడ్డారు. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం మార్చి 23నుంచి విమాన సర్వీసులపై ఆంక్షలు విధించింది. గత కొన్నినెలలుగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా ఆన్ లాక్ 4.0లో విమాన సర్వీసులకు అనుమతి లభించనుందని తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.

    కరోనా విపత్కర పరిస్థితుల్లో మాస్కు ధరించడం తప్పనిసరి అయింది. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, మీడియా కరోనా నిబంధనలు పాటించాలని ఎంత చెబుతున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు ప్రాణాలు అపాయం పడే అవకాశం ఉంది. దీంతో విమాన ప్రయాణాలు చేసేవారు తప్పనిసరి మాస్కు ధరించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. మాస్కు ధరించని ప్రయాణికుడిని నో ఫ్లైయింగ్ జాబితాలో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

    Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

    విమానంలో ప్రయాణికులకు ప్రీ-ప్యాక్డ్ భోజనం.. పానీయలను అందించున్నట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రయాణ దూరాన్ని బట్టి ప్రయాణీకులకు ఆహారం అందించనున్నారు. ప్రయాణికులు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని సూచించింది. ప్రస్తుతం విధించిన నిబంధనలను అతిక్రమిస్తే ప్రయాణీకులపై చర్యలు తీసుకునే అధికారం ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సిబ్బందికి ఉందని డీజీసీఐ స్పష్టం చేసింది. అధికారం ఉందని వెల్లడించింది. కరోనాతో గాలిలో ప్రాణం పోకుండా.. గాలి(విమానం)లో ప్రయాణించాలంటే మాస్కు తప్పనిసరి అని పలువురు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.